Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెప్ప చెల్లుమనిపించిన తండ్రి.. వైరల్ అయిన వీడియో..

దక్షిణాఫ్రికా టూర్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) అద్భుత ప్రదర్శన చేసి విమర్శకుల నోరు మూయించాడు...

Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెప్ప చెల్లుమనిపించిన తండ్రి.. వైరల్ అయిన వీడియో..
Shikhar Dhawan

Updated on: Jan 25, 2022 | 9:57 PM

దక్షిణాఫ్రికా టూర్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) అద్భుత ప్రదర్శన చేసి విమర్శకుల నోరు మూయించాడు. వన్డే సిరీస్‌లో గబ్బర్ 2 అర్ధ సెంచరీలు చేశాడు. టీం ఇండియా వన్డే సిరీస్‌ని గెలవకపోవచ్చు కానీ ధావన్ మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికా పిచ్‌పై బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ ఇప్పుడు సోషల్ మీడియా పిచ్‌పై కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాలో అలాంటి ఫన్ని వీడియో(Funny Video)ను షేర్ చేశాడు. ఈ వీడియోలో శిఖర్ ధావన్ చెంపదెబ్బ తిన్నాడు. శిఖర్ ధావన్​ను చెంపదెబ్బ కొట్టింది ఎవరినో కాదు అతని తండ్రి. ధావన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం అంటే చాలా ఇష్టం. ఈసారి తన తండ్రితో కలిసి రీల్‌ చేశాడు. ఈ రీల్‌లో శిఖర్ ధావన్ తన తండ్రి ముందు సినిమా డైలాగ్ మాట్లాడాడు అది విన్న తండ్రి శిఖర్​ను చెప్ప దెబ్బ కొడుతున్నట్లు నటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. టీమ్ ఇండియా ప్లేయర్ రితురాజ్ గైక్వాడ్ కూడా శిఖర్ వీడియోపై వ్యాఖ్యానిస్తూ అతనికి సెల్యూట్ చేశాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్ అత్యధికంగా 169 పరుగులు చేశాడు. ధావన్ బ్యాట్ 3 మ్యాచ్‌ల్లో 56 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు. తొలి, మూడో వన్డేల్లో ధావన్‌ హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 79 పరుగులుగా ఉంది.

వెస్టిండీస్‌పై పరుగులు చేయడమే శిఖర్ ధావన్ తదుపరి లక్ష్యంగా ఉంది. వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. వన్డే జట్టును ఇంకా ప్రకటించలేదు కానీ ధావన్ ప్లేస్ ఖాయం అని భావిస్తున్నారు. వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ శర్మ తిరిగి వచ్చినట్లయితే, ధావన్ అతనితో ఓపెనింగ్‌ చేయవచ్చు.

Read Also.. Virat Kohli: విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రవిశాస్త్రి.. ICC టైటిల్ అందరు గెలవలేరంటూ వ్యాఖ్యలు..