GT Vs PBKS: గుజరాత్‌ వరుస విజయాలకు బ్రేక్‌.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన పంజాబ్‌..

|

May 04, 2022 | 12:26 AM

IPL 2022: వరుస విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న గుజరాత్‌కు పంజాబ్‌ షాక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా డీవై పాటిల్‌ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌(PBKS), గుజరాత్‌ టైటాన్స్‌(GT)కు మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

GT Vs PBKS: గుజరాత్‌ వరుస విజయాలకు బ్రేక్‌.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన పంజాబ్‌..
PBKS
Follow us on

వరుస విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న గుజరాత్‌కు పంజాబ్‌ షాక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా డీవై పాటిల్‌ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌(PBKS), గుజరాత్‌ టైటాన్స్‌(GT)కు మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. పంజాబ్‌ 16 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాండ్య సేన వరుస 5 విజయాలకు బ్రేక్‌ పడింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శిఖర్‌ ధావన్‌ 53 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భానుక రాజపక్స 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. లింగ్‌స్టోన్‌ 10 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 16వ ఓవర్లలో పంజాబ్‌ ఆటగాడు లివింగ్‌ స్టోన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా 6,6,6,4,2,4 పరుగులతో మొత్తం 28 పరుగులు రాబట్టాడు. దీంతో ఆ జట్టు 4 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్‌ షమీ, ఫెర్గుసన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

అంతకుముందు పంజాబ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల గుజరాత్‌ స్పల్ప స్కోరుకే పరిమితమైంది. సాయి సుదర్శన్ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఒంటరిపోరు చేయడం వల్ల గుజరాత్‌ 143 పరుగులు చేయగలిగింది. . అర్ష్‌దీప్‌ సింగ్‌, రిషి ధవన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌ తలో వికెట్‌ తీశారు. శుభ్‌మన్ గిల్ 9, వృద్ధిమాన్‌ సాహా 21, హార్దిక్‌ పాండ్య 1, డేవిడ్ మిల్లర్ 11, పరుగులు చేశారు. ఫినిషర్‌గా మారిన రాహుల్ తెవాతియా 11 పరుగులకే ఔటయ్యాడు. రషీద్‌ ఖాన్‌ 0, ప్రదీప్‌ సాంగ్వాన్‌ 2, ఫెర్గుసన్‌ 5 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 4 వికెట్లతో రాణించాడు. లివింగ్‌స్టోన్‌, హర్షిదీప్‌ సింగ్, రిషి ధావన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Read Also..  Team India: టీమిండియా తదుపరి సారథిని తేల్చేసిన ఐపీఎల్.. లిస్టులో ఐదుగురున్నా.. సత్తా చాటింది మాత్రం ఇద్దరే?