
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ప్రేమ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. సోఫీ షైన్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ధావన్ వెల్లడించాడు. ఆమె చాలా కాలంగా శిఖర్ ధావన్‌తో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. అప్పుడే వీరి విషయంలో పుకార్లు వచ్చాయి.. ఇప్పుడు వాటిన ధావన్ నిజం చేశాడు. ధావన్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేస్తూ.. సోఫీ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫోటోపై రాసిన క్యాప్షన్ చాలా ప్రత్యేకంగా ఉంది. నా ప్రేమ అని క్యాప్షన్ ఉంది.
ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తన ప్రేమను ఫైనల్ ధావన్ కన్ఫామ్ చేశాడు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా శిఖర్ ధావన్ సోఫీతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ మ్యాచ్ చూడటానికి రావడమే కాకుండా ఒక వివాహానికి కూడా ఆమెతో కలిసి హాజరయ్యాడు. ఆ సమయంలో సోఫీతో ధావన్ చాలా క్లోజ్‌గా కూడా కనిపించాడు. మొత్తంగా తన మాజీ భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ధావన్ మరోసారి రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించాడు.