Video: “ఆమె నా భార్య”: రెండో పెళ్లి పుకార్లపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్..

Rashid Khan 2nd Marriage: టీ20 క్రికెట్‌లో ఒక గొప్ప ఆటగాడైన రషీద్, 108 మ్యాచ్‌లలో 13.69 సగటుతో 182 వికెట్లు తీసి, రెండు ఐదు వికెట్ల హాల్స్‌తో టీ20ఐలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నారు. అతను ఇటీవల ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు నాయకత్వం వహించాడు. కానీ, అతని జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.

Video: ఆమె నా భార్య: రెండో పెళ్లి పుకార్లపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్..
Rashid Khan 2nd Marriage

Updated on: Nov 12, 2025 | 2:55 PM

Rashid Khan 2nd Marriage: స్టార్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్, తాను మళ్లీ పెళ్లి చేసుకున్నారనే పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. సాంప్రదాయ ఆఫ్ఘన్ దుస్తులలో ఒక మహిళ పక్కన రషీద్ కూర్చుని ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా, రషీద్ మొదటి వివాహం అక్టోబర్ 2024లో కాబూల్‌లో జరిగింది. అతని సోదరులు – అమీర్ ఖలీల్, జాకియుల్లా, రజా ఖాన్ – కూడా అదే రాత్రి వివాహం చేసుకున్నారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మళ్లీ పెళ్లి చేసుకున్నారనే పుకార్ల మధ్య, ఆ ఫ్రేమ్‌లోని మహిళ నిజంగా తన భార్య అని రషీద్ స్పష్టం చేయడం గమనార్హం. తద్వారా తన రెండవ వివాహాన్ని ధృవీకరించాడు.

తన రెండవ వివాహం (నిఖా) కొద్ది నెలల క్రితం, అంటే ఆగస్టు 2, 2025 న జరిగిందని కూడా రషీద్ ధృవీకరించారు. “ప్రేమ, శాంతి, నేను ఎప్పుడూ ఆశించిన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఒక మహిళను” తాను వివాహం చేసుకున్నానని ఆయన రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రషీద్ ఏమన్నాడంటే.. “ఆగస్టు 2, 2025 న, నేను నా జీవితంలో ఒక కొత్త, అర్థవంతమైన అధ్యాయాన్ని ప్రారంభించాను. నేను నా నిఖా చేసుకుని, నేను ఎప్పుడూ ఆశించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఒక మహిళను వివాహం చేసుకున్నాను. నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకెళ్లాను. ఇంత సాధారణ విషయం నుంచి ఊహలు చేయడం దురదృష్టకరం. నిజం చాలా సూటిగా ఉంది, ఆమె నా భార్య, మేము దాచడానికి ఏమీ లేకుండా కలిసి నిలబడతాం. దయ, మద్దతు, అవగాహన చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు,” అంటూ రాసుకొచ్చాడు.

ఈ వీడియో నెదర్లాండ్స్‌లో రషీద్ ఖాన్ ఛారిటీ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో తీసినది. ఆఫ్ఘన్ కమ్యూనిటీల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ, శుభ్రమైన నీటిపై ఆయన చేస్తున్న కృషిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టీ20 క్రికెట్‌లో ఒక గొప్ప ఆటగాడైన రషీద్, 108 మ్యాచ్‌లలో 13.69 సగటుతో 182 వికెట్లు తీసి, రెండు ఐదు వికెట్ల హాల్స్‌తో టీ20ఐలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నారు. అతను ఇటీవల ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు నాయకత్వం వహించాడు. కానీ, అతని జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..