Video: 6,6,6,6,4.. 5 బంతుల్లో కేకేఆర్ ప్లేయర్ బీభత్సం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బౌలర్‌తో..

Sarthak Ranjan DPL 2026: బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించడమే కాకుండా మైదానంలో ప్రదర్శించిన ప్రశాంతత, గౌరవంతో సార్థక్ రంజన్ సరికొత్త స్టార్‌గా ఎదుగుతున్నాడు. డీపీఎల్‌లో సృష్టిస్తున్న ఈ సిక్సర్ల తుఫాన్ రాబోయే ఐపీఎల్ సీజన్లలో అతనికి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.

Video: 6,6,6,6,4.. 5 బంతుల్లో కేకేఆర్ ప్లేయర్ బీభత్సం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బౌలర్‌తో..
Sarthak Ranjan With Simarjeet Singh In Dpl

Updated on: Aug 06, 2026 | 2:05 PM

Sarthak Ranjan DPL 2026: ఢిల్లీ ప్రిమియర్ లీగ్ (డీపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సార్థక్ రంజన్ సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు. మాజీ చెన్నై సూపర్ కింగ్స్, ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఒకే ఓవర్ మొదటి 5 బంతుల్లోనే 28 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతడు చూపిన క్రీడాస్ఫూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

గ్రౌండ్‌లో సిక్సర్ల మోత.. సిమర్‌జీత్‌పై విరుచుకుపడ్డ రంజన్!

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ కెప్టెన్ సార్థక్ రంజన్ పూనకం వచ్చినట్లు ఊచకోత కోశాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ జట్టును ముందుండి నడిపించాడు. 50 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో ఏకంగా 95 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఐపీఎల్ స్టార్ బౌలర్ సిమర్‌జీత్ సింగ్‌ను రంజన్ లక్ష్యంగా చేసుకున్నాడు. ఓవర్ తొలి నాలుగు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచి మైదానాన్ని నలువైపులా హోరెత్తించాడు. ఐదో బంతికి కవర్స్ మీదుగా ఫోర్ బాది, ఐదు బంతుల్లోనే 28 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి ఆ ఓవర్లో మొత్తం 29 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.

మైదానంలో అద్భుత ఘట్టం.. శభాష్ రంజన్..!

ఒకే ఓవర్లో బౌండరీల వర్షం కురిపించిన తర్వాత సార్థక్ రంజన్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. ఓవర్ పూర్తయ్యాక తీవ్ర నిరాశలో ఉన్న సిమర్‌జీత్ సింగ్ వైపు వెళ్లి, అతడి భుజంపై తట్టి ఓదార్చాడు. యువ బ్యాటర్ నుంచి వచ్చిన ఈ ఊహించని గౌరవానికి మాజీ సీఎస్కే బౌలర్ సిమర్‌జీత్ కూడా వెంటనే స్పందిస్తూ రంజన్‌ను అభినందించాడు.

ఇదికూడా చదవండి: అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక..!

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞుడైన సిమర్‌జీత్ సింగ్‌ను ఒక యంగ్ బ్యాటర్ ఇలా ఆత్మీయంగా ఓదార్చడం క్రికెట్ అభిమానులకు బాగా నచ్చింది. ప్రత్యర్థి బౌలర్‌పై సాధించిన ఆధిక్యం కంటే ఆయన చూపిన క్రీడాస్ఫూర్తిని ప్రశంసిస్తూ క్రీడాభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఐపీఎల్‌లో నో ఛాన్స్.. డీపీఎల్‌లో విధ్వంసం..!

కేకేఆర్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2026 వేలంలో రూ.30 లక్షలకు సార్థక్ రంజన్‌ను సొంతం చేసుకుంది. అయితే స్టార్ ప్లేయర్ల పోటీ వల్ల అతనికి తుది జట్టులో ఆడే అవకాశం ఒక్కటి కూడా లభించలేదు. లీగ్‌లో అవకాశం రాకపోయినా నిరాశ చెందకుండా డీపీఎల్‌ను ఒక వేదికగా మలుచుకున్నాడు.

ప్రస్తుతం డీపీఎల్ 2026 సీజన్‌లో రంజన్ ఆడిన 2 ఇన్నింగ్స్‌ల్లోనే 178.65 స్రైక్ రేట్‌తో 159 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత సీజన్‌లోనూ 449 పరుగులు చేసి సెంచరీతో మెరిసిన అనుభవం ఇతనికి ఉంది.

ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

కేకేఆర్ తదుపరి తుపాను.. ఐపీఎల్ 2027లో ఛాన్స్ ఖాయమేనా?

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో అజింక్యా రహానే దూరమైన తర్వాత మిడిల్ ఆర్డర్ లేదా ఓపెనింగ్‌లో సరైన కవర్ కోసం రంజన్‌ను కేకేఆర్ బ్యాకప్‌గా తీసుకుంది. ప్రస్తుత డీపీఎల్‌లో అతడు చూపిస్తున్న అసాధారణ ఫామ్, హిట్టింగ్ సామర్థ్యం చూస్తుంటే ఐపీఎల్ 2027 సీజన్‌లో నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us