Sarfaraz Ahmed : పాక్ బుద్ధి మారదు..ఇండియా మ్యాచ్‌లో రూల్స్ బ్రేక్ చేసిన పాక్ మెంటార్..ఐసీసీ యాక్షన్ తప్పదా?

Sarfaraz Ahmed : అండర్-19 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత అండర్-19 జట్టు మెంటార్ సర్ఫరాజ్ అహ్మద్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Sarfaraz Ahmed : పాక్ బుద్ధి మారదు..ఇండియా మ్యాచ్‌లో రూల్స్ బ్రేక్ చేసిన పాక్ మెంటార్..ఐసీసీ యాక్షన్ తప్పదా?
Sarfaraz Ahmed

Updated on: Feb 01, 2026 | 7:32 PM

Sarfaraz Ahmed : అండర్-19 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత అండర్-19 జట్టు మెంటార్ సర్ఫరాజ్ అహ్మద్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్ పరిసరాల్లో ఆయన మొబైల్ ఫోన్ వాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీసీ సీరియస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అండర్-19 ప్రపంచకప్ సూపర్-6 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కేవలం ఆటపరంగానే కాకుండా, మైదానం వెలుపల జరిగిన కొన్ని పరిణామాల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. పాక్ జట్టుకు మెంటార్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్, మ్యాచ్ మధ్యలో మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరా కంటికి చిక్కారు. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రీడాకారులు లేదా కోచింగ్ సిబ్బంది ఎవరూ కూడా కమ్యూనికేషన్ పరికరాలను (ఫోన్లు, ఐప్యాడ్లు) ఉపయోగించకూడదు. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో అసలు సర్ఫరాజ్ కు ఫోన్ వాడే అనుమతి ఎవరు ఇచ్చారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

క్రికెట్‌లో PMOA అనే నిబంధన చాలా కఠినంగా ఉంటుంది. మైదానంలోని డ్రెస్సింగ్ రూమ్, డగౌట్, అంపైర్ల గదులు, భోజన ప్రాంతాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రదేశాల్లోకి ప్రవేశించాలంటే ప్రత్యేకమైన అక్రిడిటేషన్ కార్డు ఉండాలి. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ పర్యవేక్షణలో ఉండే ఈ ఏరియాలో మొబైల్ ఫోన్ల వాడకం పూర్తిగా నిషేధం. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటే, ఐసీసీ అధికారుల అనుమతితో మాత్రమే ల్యాండ్‌లైన్ ఉపయోగించాలి. సర్ఫరాజ్ అహ్మద్ నేరుగా మొబైల్ వాడుతూ కనిపించడం ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ కింద నేరంగా పరిగణించబడే అవకాశం ఉంది.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. సర్ఫరాజ్ వంటి సీనియర్ ఆటగాడు ఇలాంటి తప్పు చేయడం ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఇరకాటంలో నెట్టింది. కొందరు సోషల్ మీడియా యూజర్లు దీనిని మ్యాచ్ ఫిక్సింగ్ కోణంలో కూడా విమర్శిస్తున్నారు, అయితే అది నిరూపితం కాలేదు. కానీ, నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ సర్ఫరాజ్‌కు భారీ జరిమానా విధించడంతో పాటు, కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. ఐసీసీ ఈ విషయంపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..