Ranji Trophy: ఇటీవలే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. అయితే, అంతా ఆశించినట్లుగా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇస్తారని అనుకున్నా.. మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. దీంతో ఇక ఈ ప్లేయర్ దేశవాళీలకే పరిమితవ్వాలంటూ క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తు్న్నారు. అయితే, బీసీసీఐ నుంచి పిలుపురాకపోతేనేం.. నా ఆటతో అందర్నీ మొప్పిస్తానంటూనే ఉన్నాడు. ఇప్పటికే వరుస సెంచరీలతో దేశవాళీలో సత్తా చాటిన సర్ఫరాజ్.. తాజాగా మరోసారి సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెలక్టర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తొలిరోజు సెంచరీ చేసిన సర్ఫరాజ్.. ఆ తర్వాత అతడి హావభావాలు చూస్తుంటే.. భారత సెలెక్టర్లు తమ తప్పును తెలుసుకునేలా చేస్తున్నాడనిపించింది. వారికి ఒక సందేశం ఇచ్చినట్లు చూడొచ్చు. మీరు నన్ను ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా సెంచరీల వర్షం ఆగదనే చెప్పే ప్రయత్నం చేసినట్లు వీడియోలో చూడొచ్చు.
Hundred and counting! ?
Yet another impressive knock from Sarfaraz Khan ??
Follow the Match ▶️ https://t.co/sV1If1IQmA#RanjiTrophy | #DELvMUM | @mastercardindia pic.twitter.com/GIRosM7l14
— BCCI Domestic (@BCCIdomestic) January 17, 2023
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులు చేశాడు. 155 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ పరుగులు సాధించాడు. టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్‌ను పట్టించుకోకపోవడంతో అతని బ్యాట్ నుంచి ఈ సెంచరీకి ప్రాధాన్యత పెరిగింది. టీమిండియా టెస్టు జట్టులోకి ఎంపిక కాకపోవడంతో సర్ఫరాజ్ నిరాశకు గురయ్యాడు. ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీపై సెంచరీ చేసిన తర్వాత ముంబై కోచ్ అమోల్ మజుందార్ తన టోపీని తీసి అతనికి సెల్యూట్ చేయడం బహుశా ఇదే కారణం కావచ్చని అంటున్నారు.
ఢిల్లీపై సెంచరీ సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 13వ సెంచరీగా నిలిచింది. అయితే, అతని గత 25 ఇన్నింగ్స్‌లను మాత్రమే పరిశీలిస్తే, అతను 10 సెంచరీలు సాధించాడు. దీన్నిబట్టి అతని ప్రస్తుత ఫాంత ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. అతను టీమిండియా టెస్టు జట్టులో ఎంపికయ్యేందుకు ఎందుకు అర్హుడో ఇట్టే చెప్పుకోవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..