Sara Tendulkar-Shubman Gill: శుభ్మన్ గిల్ కోసం సారా స్పెషల్ విషెస్.. వైరలవుతోన్న సచిన్ డాటర్ ట్వీట్..

Sachin Tendulkar Daughter Viral Post: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడ ప్రేక్షకుల సామర్థ్యం 1 లక్ష 32 వేలు. ఇప్పటి వరకు చాలా మంది ప్రేక్షకులు ఏ క్రికెట్ మ్యాచ్‌ని చూసేందుకు రాలేదు. అయితే, ఇంతటి గొప్ప మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే టీమిండియా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖుల నుంచి మాజీల వరకు అంతా ట్రోఫీ గెలవాలంటూ కోరుకుంటున్నారు.

Sara Tendulkar-Shubman Gill: శుభ్మన్ గిల్ కోసం సారా స్పెషల్ విషెస్.. వైరలవుతోన్న సచిన్ డాటర్ ట్వీట్..
Sara Tendulkar Shubman Gill

Updated on: Nov 19, 2023 | 12:32 PM

Sachin Tendulkar Daughter Viral Post: 44 రోజులు, 47 మ్యాచ్‌లు, 94 ఇన్నింగ్స్‌ల తర్వాత వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. 5 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, 2 సార్లు విజేత భారత్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అతిపెద్ద టోర్నమెంట్ 13వ సారి జరగనుంది. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు తుది జట్లూ తమ పేర్లతో అధిక (7) టైటిళ్లను కలిగి ఉన్నాయి.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడ ప్రేక్షకుల సామర్థ్యం 1 లక్ష 32 వేలు. ఇప్పటి వరకు చాలా మంది ప్రేక్షకులు ఏ క్రికెట్ మ్యాచ్‌ని చూసేందుకు రాలేదు. అయితే, ఇంతటి గొప్ప మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే టీమిండియా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖుల నుంచి మాజీల వరకు అంతా ట్రోఫీ గెలవాలంటూ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో తాజాగా సచిన్ కూతరు ట్వీట్ వైరలవుతోంది. ఇప్పటికే వినిపిస్తున్న గాసిప్స్ మేరకు సచిన్ కూతరు, టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్ లవ్‌లో ఉన్నారంటూ చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీరి ఫొటోలు కూడా ఇప్పటికే వైరలవుతున్నాయి. గిల్ ఆడే మ్యాచ్‌ను చూసేందుకు సారా కూడా రావడం కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు సచిన్ కూతురు కూడా వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా ట్రోఫీ గెలవాలని కోరుకుంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్‌కు ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ ట్వీట్ చేసింది.

ఫైనల్ గేమ్ కోసం అంతా సిద్ధం. మేం కూడా చూసేందుకు రెడీగా ఉన్నాం. శుభ్మాన్ గిల్ బాగా ఆడాలంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..