IND vs SA: 6,6,6,6,6,6.. సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందే రెచ్చిపోయిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్..

Sanju Samson: భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ 2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తన బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు సంజు శాంసన్ ఫామ్‌పై జట్టు యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

IND vs SA: 6,6,6,6,6,6.. సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందే రెచ్చిపోయిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్..
Sanju Samson

Updated on: Dec 05, 2025 | 8:16 AM

Sanju Samson: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, కేరళ కెప్టెన్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే కీలకమైన టీ20 సిరీస్‌కు ముందు శాంసన్ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమిండియా అభిమానులకు శుభవార్త.

3 మ్యాచుల్లోనే 139 పరుగులు..

ఈ టోర్నీలో కేరళ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంజు, తన బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం మూడు కీలక ఇన్నింగ్స్‌లలోనే అతను మొత్తం 139 పరుగులు సాధించాడు.

మొదటి మ్యాచ్: 41 బంతుల్లో 51 పరుగులు (నాటౌట్)

ఇవి కూడా చదవండి

మూడో మ్యాచ్: కేవలం 15 బంతుల్లోనే 43 పరుగులు

ఐదో మ్యాచ్: 28 బంతుల్లో 45 పరుగులు

మొత్తంగా ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచుల్లో 141.59 స్ట్రైక్ రేట్‌తో 160 పరుగులు చేశాడు. అతని అద్భుత ఫామ్ కారణంగా కేరళ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది.

ప్లేయింగ్ XIలో చోటు ఖాయమేనా?..

గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సంజు, ఆస్ట్రేలియా సిరీస్‌లో తుది జట్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో జితేష్ శర్మకు అవకాశం దక్కింది. కానీ, ప్రస్తుతం సంజు చూపిస్తున్న జోరు చూస్తుంటే, డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతను వికెట్ కీపర్‌గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజు ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

సిరీస్ వివరాలు..

భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 9న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ డిసెంబర్ 9న కటక్‌లో జరుగుతుంది. డిసెంబర్ 11న ముల్లన్‌పూర్ స్టేడియం రెండవ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలో జరుగుతుంది. నాల్గవ, ఐదవ మ్యాచ్‌లు డిసెంబర్ 17న లక్నోలో, డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. సంజు ఇదే ఫామ్‌ను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..