Sachin Tendulkar : ఆల్టిట్యూడ్ ఏదైనా.. యాటిట్యూడ్ మారదు.. విమానంలో కూడా క్రికెట్ ఆడిన సచిన్

Sachin Tendulkar : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తూ సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన వీడియో వైరల్‌గా మారింది. కూతురు సారా టెండూల్కర్ పట్టిన క్యాచ్, సచిన్ చేసిన ఫన్నీ కామెంట్లు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి.

Sachin Tendulkar : ఆల్టిట్యూడ్ ఏదైనా.. యాటిట్యూడ్ మారదు..  విమానంలో కూడా క్రికెట్ ఆడిన సచిన్
Sachin

Updated on: Jun 16, 2026 | 9:08 AM

Sachin Tendulkar : ప్రయాణాలు అంటేనే సరికొత్త జ్ఞాపకాలను అపురూపంగా మార్చుకోవడం. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు చేసే సందడి అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా చేసిన ఒక పని నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ, తన మనసులో క్రికెట్ పై ఉన్న ప్రేమ అస్సలు తగ్గలేదని సచిన్ మరోసారి నిరూపించాడు. ఏకంగా ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తూ.. ఫ్లైట్ లోపలే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.

ఈ సరదా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన క్రేజీ వీడియోను సచిన్ టెండూల్కర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోకు “ఆల్టిట్యూడ్ ఏదైనా కావచ్చు.. కానీ యాటిట్యూడ్ మాత్రం ఎప్పటికీ మారకూడదు” అంటూ ఒక అద్భుతమైన క్యాప్షన్ కూడా జోడించాడు. ఈ వీడియోలో సచిన్ తన ప్రైవేట్ జెట్ లోపల బ్యాటింగ్ చేస్తుండగా.. ఎదురుగా అతడి కోడలు సానియా చందో ఒక సాఫ్ట్ రెడ్ బాల్‌తో బౌలింగ్ చేస్తూ కనిపించింది.

ఇక ఈ మ్యాచ్‌లో సచిన్ కూతురు సారా టెండూల్కర్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని వికెట్ కీపర్, ఫీల్డర్ అవతారమెత్తింది. సానియా వేసిన ఒక బంతి సచిన్ బ్యాట్‌కు తగలకుండా వెళ్లడంతో.. సారా సరదాగా గట్టిగా అవుట్ అంటూ అంపైర్ స్టైల్లో అప్పీల్ చేసింది. దీనికి సచిన్ నవ్వుతూ “నన్ను అవుట్ చేయడం మీ వల్ల కాదు.. నన్ను ఎవరూ అవుట్ చేయలేరు” అని సరదాగా కామెంట్ చేశాడు. అంతేకాకుండా తన చేతిలో ఉన్న బ్యాట్‌ను తిరగేసి పట్టుకుని.. “కేవలం ఇలా బ్యాట్ హ్యాండిల్‌తో ఆడితేనే నాకు అవుట్ అయ్యే చిన్న ఛాన్స్ ఉంటుంది” అని అనడంతో విమానంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

ఆ తర్వాత జరిగిన సీన్ అసలైన ట్విస్ట్. బ్యాట్ తిరగేసి ఆడుతున్న క్రమంలో సానియా వేసిన తర్వాతి బంతిని సచిన్ గాల్లోకి లేపాడు. మొదట ఆ క్యాచ్‌ను సారా మిస్ చేసినప్పటికీ.. ఆ తర్వాతి బంతికే అత్యంత అద్భుతంగా క్యాచ్ పట్టి గాల్లోకి ఎగురుతూ యాయ్.. అవుట్ అంటూ గట్టిగా కేకలు వేసింది. దీంతో సచిన్ కూడా నవ్వుతూ తాను అవుట్ అయినట్లు ఒప్పుకుని పెవిలియన్ చేరాడు. తండ్రి, కూతుళ్ల మధ్య జరిగిన ఈ క్యూట్ అండ్ లవ్లీ మూమెంట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే ఏకంగా 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని గ్లోబల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోపై అభిమానులు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ “సార్ దయచేసి బయట ఆడుకోండి.. లోపల విండో గ్లాస్ లేదా టీవీ స్క్రీన్ పగిలితే భారీగా ఖర్చవుతుంది” అని కామెంట్ చేయగా.. మరో యూజర్ “సార్ మీరు బ్యాట్ హ్యాండిల్‌తో ఆడినా బాల్ మిడిల్ అవుతోంది.. అందుకే మిమ్మల్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు” అని కొనియాడారు. క్రికెట్ పట్ల సచిన్‌కు ఉన్న అంకితభావానికి ఈ వీడియోనే నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us