Video: 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తుఫాన్ బ్యాటింగ్.. బౌలింగ్‌లో ఒక వికెట్.. రీఎంట్రీలో అదరగొట్టిన క్రికెట్ గాడ్.. వీడియో చూశారా?

|

Jan 19, 2024 | 12:24 PM

Sachin Tendulkar Bowlling Video: బెంగళూరులోని సత్యసాయి గ్రామం ముద్దెనహళ్లి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో యువరాజ్ నేతృత్వంలోని వన్ ఫ్యామిలీ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఫ్యామిలీ ఇన్నింగ్స్‌లో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ డారెన్ మాడీ వికెట్ తీసుకున్నాడు. తన రెండు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

Video: 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తుఫాన్ బ్యాటింగ్.. బౌలింగ్‌లో ఒక వికెట్.. రీఎంట్రీలో అదరగొట్టిన క్రికెట్ గాడ్.. వీడియో చూశారా?
Sachin Tendulkar
Follow us on

One World vs One Family T20 2024: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు గడిచాయి. అయినప్పటికీ అభిమానులు సచిన్ బ్యాటింగ్, బౌలింగ్ చూడటానికి ఇష్టపడుతుంటారు. గురువారం, టెండూల్కర్ వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ (One World vs One Family Cup)లో వన్ వరల్డ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో అతని జట్టు యువరాజ్ సింగ్ జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో చాలా కాలం తర్వాత సచిన్ బౌలింగ్‌ను అభిమానులు ఆస్వాదించే అవకాశం లభించింది.

బెంగళూరులోని సత్యసాయి గ్రామం ముద్దెనహళ్లి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో యువరాజ్ నేతృత్వంలోని వన్ ఫ్యామిలీ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఫ్యామిలీ ఇన్నింగ్స్‌లో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ డారెన్ మాడీ వికెట్ తీసుకున్నాడు. తన రెండు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

చాలా ఏళ్ల తర్వాత సచిన్ బౌలింగ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అదే సమయంలో టెండూల్కర్ ముఖంలోనూ ఆనందం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ వీడియోను ఇక్కడ చూడండి:

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో టెండూల్కర్ దూకుడు బ్యాటింగ్‌ను అభిమానులు ఆస్వాదించారు. టీమిండియా మాజీ దిగ్గజం 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగుల కీలమైన ఇన్నింగ్స్ ఆడాడు.

సచిన్ అంతర్జాతీయ కెరీర్‌లోనూ బౌలర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మాస్టర్ బ్లాస్టర్ చాలా సందర్భాలలో బంతితో మ్యాచ్‌లను గెలుచుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సచిన్ పేరిట 201 వికెట్లు ఉన్నాయి.

క్రికెట్‌కు ఉన్న ఆదరణను సద్వినియోగం చేసుకోవడంతోపాటు సౌకర్యాలు లేని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మ్యాచ్‌ను నిర్వహించడం ప్రధాన ఉద్దేశ్యం. వివిధ దేశాలకు చెందిన పలువురు అనుభవజ్ఞులైన క్రీడాకారులు ఈ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..