ఇంగ్లాండ్‌ని ఇబ్బంది పెట్టిన ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు..! విరాట్ కోహ్లీ కంటే ముందు వరుసలో నిలిచాడు..

|

Sep 13, 2021 | 10:24 PM

Cricket News: నెదర్లాండ్స్ క్రికెటర్ ర్యాన్ టెన్ డస్చేట్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరగా అతను టీ 20 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ తరపున

ఇంగ్లాండ్‌ని ఇబ్బంది పెట్టిన ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు..! విరాట్ కోహ్లీ కంటే ముందు వరుసలో నిలిచాడు..
Ryan Ten Doeschate
Follow us on

Cricket News: నెదర్లాండ్స్ క్రికెటర్ ర్యాన్ టెన్ డస్చేట్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరగా అతను టీ 20 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ తరపున ఆడనున్నాడు. 41 ఏళ్ల ర్యాన్ టెన్ డస్చేట్ నెదర్లాండ్స్‌లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌లలో ఒకరు. అతను ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ టీమ్ ఎసెక్స్ కోసం కూడా ఆడుతున్నాడు. అతను ప్రపంచవ్యాప్తంగా టి 20 లీగ్‌లలో కూడా ఆడాడు. వీటిలో ఐపిఎల్ కూడా ఉంది. అతను 2011లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. 2012, 2014లో ఐపిఎల్ గెలిచిన కెకెఆర్ జట్టులో భాగం.

చివరిసారిగా 2015 లో IPL లో ఆడాడు. ఈ లీగ్‌లో అతను 29 మ్యాచ్‌లలో 23.28 సగటుతో 326 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 70 నాటౌట్. అతను నెదర్లాండ్స్ నుంచి ఇతర దేశంపై సెంచరీ సాధించిన మొదటి క్రికెటర్. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాట్స్‌మెన్‌గా ర్యాన్ టెన్ డస్చేట్ నిలిచాడు. 67 సగటుతో 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సగటు 59.07తో మూడో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 56.92 సగటుతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

నెదర్లాండ్స్ తరఫున ర్యాన్ టెన్ డస్చేట్ 33 వన్డేలు ఆడాడు. ఐదు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీల సహాయంతో 1572 పరుగులు చేశాడు. అదే సమయంలో 22 అంతర్జాతీయ టి 20 మ్యాచ్‌లలో 44.41 సగటుతో 533 పరుగులు చేశాడు. అతను ఈ ఫార్మాట్‌లో మూడు అర్ధ సెంచరీలు చేశాడు. నెదర్లాండ్స్‌ను ప్రపంచ కప్‌కు తీసుకెళ్లడంలో అతను చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2011 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై 109 ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. కానీ ర్యాన్ టెన్ డస్చేట్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

CM KCR on Ganesh Immersion: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష!

Kidney Problems: కరోనాతో ఐసీయూలో చేరిన వారిలో కిడ్నీ సమస్యలు.. మూత్రపిండాల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ఎలా?

Korea Missile: అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియా నియంత కిమ్.. మళ్లీ ఎం చేశాడో తెలుసా..?