SA vs SL: టాస్ గెలిచిన లంక.. ఆదిలోనే సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

South Africa vs Sri Lanka, 4th Match, ICC Cricket World Cup 2023: ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 80 వన్డేలు జరిగాయి. దక్షిణాఫ్రికా 45 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, శ్రీలంక 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, ఒక మ్యాచ్‌లో ఫలితం సాధించలేకపోయింది. ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. దక్షిణాఫ్రికా 4 గెలిచింది. శ్రీలంక ఒకదానిలో మాత్రమే గెలిచింది. కాగా ఒక మ్యాచ్ కూడా టైగా మిగిలిపోయింది.

SA vs SL: టాస్ గెలిచిన లంక.. ఆదిలోనే సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
Sa Vs Sl

Updated on: Oct 07, 2023 | 3:42 PM

South Africa vs Sri Lanka Playing 11: ప్రపంచకప్ 2023లో తొలి డబుల్ హెడర్‌లో భాగంగా రెండో మ్యాచ్ న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తోన్న దక్షిణాఫ్రికా 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ క్రీజులో ఉన్నారు.

8 పరుగుల వద్ద కెప్టెన్ టెంబా బావుమా ఔటయ్యాడు. అతన్ని దిల్షాన్ మధుశంక ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్ 11..

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, గెరాల్ట్ కోయెట్జీ మరియు లుంగి ఎన్గిడి.

శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, దునిత్ వెల్లలాగే, మహిష్ తీక్షణ, కసున్ రజిత మరియు దిల్షన్ మధుశంక.

హెడ్-టు-హెడ్ రికార్డులు..

దక్షిణాఫ్రికా చివరి ఐదు ODI మ్యాచ్‌లలో మూడింటిని గెలుచుకుంది. ప్రపంచకప్‌నకు ముందు స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా ఆ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే.. రెండు జ‌ట్లూ సమవుజ్జీలుగా క‌నిపిస్తున్నాయి. శ్రీలంక ఆడిన ఐదు వన్డేల్లో మూడింటిలో విజయం సాధించింది.

ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 80 వన్డేలు జరిగాయి. దక్షిణాఫ్రికా 45 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, శ్రీలంక 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, ఒక మ్యాచ్‌లో ఫలితం సాధించలేకపోయింది. ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. దక్షిణాఫ్రికా 4 గెలిచింది. శ్రీలంక ఒకదానిలో మాత్రమే గెలిచింది. కాగా ఒక మ్యాచ్ కూడా టైగా మిగిలిపోయింది.

వరుసగా ఫోర్లు బాదిన సౌతాఫ్రికా బ్యాటర్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..