Rohit Sharma-Virat Kohli: నాలుగు సంవత్సరాల క్రితం 2017 సంవత్సరంలో ఎంఎస్ ధోని తరువాత విరాట్ కోహ్లీ వన్డే జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్ అయిన వెంటనే విరాట్ కోహ్లీ అద్భుతాలు చేసి టీమిండియాను వేరే లెవల్లోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు విరాట్ ప్రయాణం ముగిసింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా టీ20 తర్వాత వన్డే కెప్టెన్‌గా ఉండడం లేదు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. గత నాలుగేళ్లలో కింగ్ కోహ్లీ ఏం సాధించాడో ఓ సారి చూద్దాం.
విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ రికార్డు అద్భుతమైనది. విరాట్ కోహ్లి సారథ్యంలో 95 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 65 మ్యాచ్‌లు గెలవగా, కేవలం 27 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ 68 శాతం విజయాలు సాధించడం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం. విజయాల శాతంలో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ 77.71 శాతం మ్యాచ్‌లు గెలుపొందగా, రికీ పాంటింగ్ 76.14 శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. హాన్సీ క్రోంజే 73.70 మ్యాచ్‌లు గెలిచాడు.
విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 గెలిచింది. కేవలం 4 మాత్రమే ఓడిపోయింది. విరాట్ కోహ్లీ సొంతగడ్డపై 9 ద్వైపాక్షిక సిరీస్‌లలో 8 గెలిచాడు. వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై కూడా భారత్‌కు విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ను 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై టీమిండియా 5-1తో విజయం సాధించింది. వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా భారత్ 3-1తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వేలో జరిగిన వన్డే సిరీస్‌లను కూడా టీమిండియా కైవసం చేసుకుంది.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వన్డే రికార్డు కూడా అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 21 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో సహా 72.65 సగటుతో 5449 పరుగులు చేశాడు. వన్డే కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రికీ పాంటింగ్ 22 వన్డే సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.