IND vs PAK: రోహిత్‌ను ఫోకస్ చేసిన కెమెరామ్యాన్.. హిట్‌మ్యాన్ రియాక్షన్ చూడండి

Rohit Sharma: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమయంలో, రోహిత్ కెమెరామెన్‌ ప్రవర్తనతో విసుగుచెందాడు. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వరా బాబు అంటూ సూచనలు ఇచ్చినట్లు అనిపించింది. ప్రజంట్ ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

IND vs PAK:  రోహిత్‌ను ఫోకస్ చేసిన కెమెరామ్యాన్.. హిట్‌మ్యాన్ రియాక్షన్ చూడండి
Rohit Sharma

Updated on: Sep 02, 2023 | 5:51 PM

భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులకు ఇంట్రస్ట్ ఉంటుంది.  ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ రెండు జట్లు ఆసియా కప్-2023లో శనివారం తలపుడుతున్నాయి. ఈ మ్యాచ్‌పై వర్షం ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వర్షం కురిసింది. దీని తర్వాత, మొదటి ఇన్నింగ్స్‌లో ఐదవ ఓవర్ బౌలింగ్ అవుతున్నప్పుడు కూడా వర్షం కురిసింది.  రెయిన్ విరామ సమయంలో రోహిత్ కెమెరా నుండి తప్పించుకోవడం నెట్టింట వైరల్ అయ్యింది. టాస్ గెలిచిన సారథి రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. టీమ్ ఇండియాకు శుభారంభం లభించింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ జరుగుతుండగా వర్షం కురిసి మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.

కెమెరా ద్వారా ఇబ్బంది

వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సమయంలో రోహిత్ శర్మ డగ్ అవుట్‌లో కూర్చుని టీమ్ మేట్స్‌తో మాట్లాడుతున్నాడు. వర్షం ఆగిపోయింది. రోహిత్-గిల్ హెల్మెట్ ధరించి.. మళ్లీ బరిలోకి దిగేందుకు సన్నద్దమయ్యారు. ఇంతలో కెమెరామెన్ కళ్లు రోహిత్ పై పడ్డాయి. అతను కెమెరాతో రోహిత్ దగ్గరే నిలబడి షూట్ చేస్తున్నాడు. ఆ పని రోహిత్‌కి నచ్చలేదు. కెమెరాను తీసేయమని కెమెరామెన్‌ని కోరాడు. రోహిత్‌కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. ఇందులో అతను కెమెరాను తీసివేయమని కెమెరామెన్‌ని కాస్త చిరాగ్గానే కోరడం కనిపించింది.

భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది

ఈ మ్యాచ్‌లో పాక్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌‌ను భారత జట్టు బ్యాట్స్‌మెన్‌ ధీటుగా ఎదుర్కొంటారని అంతా భావించారు. అయితే షాహీన్ షా ఆఫ్రిది భారత బ్యాటర్లను షేక్ చేశాడు. మొదట రోహిత్‌ను బౌల్డ్ చేశారు షాహీన్. ఐదో ఓవర్ చివరి బంతికి షాహీన్ బౌలింగ్ లో రోహిత్ అవుటయ్యాడు. ఆ తర్వాత షాహీన్‌  బౌలింగ్‌లో కోహ్లీ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడ. హరీస్ రవూఫ్.. శ్రేయాస్ అయ్యర్‌, గిల్‌ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను డకౌట్‌కు పంపాడు. రోహిత్ కేవలం 11 పరుగులు చేసి ఔటవ్వగా.. కోహ్లి నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయ్యర్ 14.. గిల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. నాలుగు టాప్ వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో ఉంది భారత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..