Rohit Sharma: 99% వర్కౌట్ టైమ్.. మిగిలిన 1% అలా.. హిట్ మ్యాన్ ఇంట్రెస్టింగ్ వీడియో

|

Sep 11, 2024 | 1:29 PM

బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైరల్ ఇన్‌స్టాగ్రమ్ ట్రెండ్‌లో భాగంగా హిట్ మ్యాన్ ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. 99% వర్కౌట్ టైమ్‌తో పాటు మిగిలిన 1% టైమ్ రోహిత్ శర్మ ఏం చేస్తారని తెలిపే వీడియో ఇది.

Rohit Sharma: 99% వర్కౌట్ టైమ్.. మిగిలిన 1% అలా.. హిట్ మ్యాన్ ఇంట్రెస్టింగ్ వీడియో
Rohit Sharma
Follow us on

బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైరల్ ఇన్‌స్టాగ్రమ్ ట్రెండ్‌లో భాగంగా హిట్ మ్యాన్ ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. 99% వర్కౌట్ టైమ్‌తో పాటు మిగిలిన 1% టైమ్ రోహిత్ శర్మ ఏం చేస్తారని తెలిపే వీడియో ఇది. 99 శాతం టైమ్‌లో జిమ్‌‌లో రోహిత్ శర్మ కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే మిగిలిన 1% టైమ్ రోహిత్ శర్మ ఇతర ఆటగాళ్లు, సహచరులను ఆటపట్టిస్తూ.. వారితో కలిసి కాలక్షేపం చేస్తూ గడుపే ఆనంద క్షణాలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో హిట్ మ్యాన్ ఫుల్ ఫైర్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ జోరును అడ్డుకునే సత్తా రోహిత్ శర్మ‌కు ఉందంటూ కొందరు నెటిజన్లు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఇన్‌స్టాలో రోహిత్ శర్మ షేర్ చేసిన వీడియో చూడండి..

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఆటగాళ్లు.. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ తేలిగ్గా తీసుకోవడం లేదని ఈ వీడియో ద్వారా తేటతెల్లం అవుతోంది. దాని సొంతగడ్డపైనే పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన జోష్‌లో బంగ్లాదేశ్ ఉంది. ఆతిథ్య భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ కోసం బలమైన జట్టును బీసీసీబీ సెలక్షన్ కమిటీ గత వారం ఎంపిక చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, బుమ్రా, యాష్ దయాల్ ఉన్నారు.