Team India Squad For Asia Cup 2023: ఆసియా కప్ 2023కు శ్రీలంక, పాకిస్థాన్ దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు అంటే ఆగస్టు 30న ఈ మోగా టోర్నీ ప్రారంభమవుతుంది. ఆసియాకప్ 2023 ఫైనల్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌లో ఆడనుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్టు మరోసారి ముఖాముఖిగా తలపడనున్నాయి. టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే పాకిస్థాన్‌లో జరగనున్నాయి. గ్రూప్ దశలో 3 మ్యాచ్‌లు, సూపర్-4లో ఒక మ్యాచ్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఇది కాకుండా, అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై కీలక అప్‌డేట్ వచ్చింది.
ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు భారత్ 16 నుంచి 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనుందని తెలుస్తోంది. వార్తా సంస్థ PTI ప్రకారం, శ్రీలంకలో జరిగే ఆసియా కప్, ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఉనద్కత్, శార్దూల్‌కు ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ కూడా తిరిగి జట్టులోకి రానున్నారు.
ఈ వారం చివర్లో లేదా వచ్చే వారం ఆసియా కప్‌నకు భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు. అదే సమయంలో మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు కనిపిస్తారు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు. నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా హార్దిక్ పాండ్యా తన సేవలు అందించనున్నాడు. అతను ప్రతి మ్యాచ్‌లో ఆరు నుంచి ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. ఇటువంటి పరిస్థితిలో రిజర్వ్ ఫాస్ట్ బౌలర్ పాత్ర ముఖ్యమైనదని భావిస్తున్నారు. కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ స్పిన్నర్స్‌గా అవకాశం పొందవచ్చు.
Asia Cup Promo 🔥🔥🔥
Much better than WC Promo 🤝🏻😉#AsiaCup2023 | #BabarAzam𓃵pic.twitter.com/iS9sBwy76T— King Babar Azam Army (@babarazamking_) August 3, 2023
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, యుజ్వేంద్ర చాహల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..