INDIA VS ENGLAND 2021: చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ పరుగుల వరద పారించాడు. 231 బంతుల్లో 161 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 18 బౌండరీలు 2 సిక్సర్లు బాదేశాడు. జట్టులో మిగతా సహచరులు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో సునాయసంగా శతకం చేసేశాడు. అయితే సెంచరీ ముందు హిట్‌మ్యాన్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయితే అప్పుడు స్టేడియంలో ఉన్న అతడి భార్య రితికా సజ్దెదీ టెన్షన్‌కు గురైంది.
97 పరుగుల వద్ద ఉన్నప్పుడు మాత్రం ఆమె గుండెలయ అదుపుతప్పింది! లబ్..డబ్.. అంటూ వేగంగా కొట్టుకోసాగింది. చేతివేళ్లు బిగపట్టుకొని మరీ మ్యాచ్ చూసింది. రోహిత్ 97 పరుగుల వద్ద ఉండగా మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ అతడిని పరీక్షించారు. ముఖ్యంగా అలీ వేసిన బంతులను అతడు స్వీప్ చేసే క్రమంలో ఫీల్డర్ల ముంగిట బంతులు గాల్లోకి లేచాయి. దాదాపుగా అతడు ఔటవుతాడేమో అనిపించింది. బ్రాడ్ వేసిన బంతులు అతడి బ్యాటు అంచును తాకి కీపర్ చేతుల్లో పడుతున్నట్టుగా కనిపించాయి. దీంతో అక్కడే గ్యాలరీలో ఉన్న రోహిత్ సతీమణి రితికా సజ్దె ఆందోళనకు గురైంది. ఆమె హృదయస్పందన అత్యంత వేగమైంది. ఫింగర్స్ క్రాస్ చేసి కూర్చొంది. శతకం చేశాకా ఫింగర్స్ క్రాస్ చేసే కరతాళధ్వనులు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి.
? for #rohitsharma45 brilliant played in this turning track, It’s not the ? that hurts Eng but the way he dominated the bowlers right from the start, He always in this touch bt unable to score big after start but this is unbelievable, treat for indian fans #ritika @ImRo45 ?? pic.twitter.com/jQqXL66jPc
— Mahesh Mohanty? (@ItsMahicasm1) February 13, 2021