Rishabh Pant : రిషబ్ పంత్ రీఎంట్రీ.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు సెలక్ట్ కావాలంటే ఇది చేయాల్సిందే

భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల చివరిలో జరగనున్న రంజీ ట్రోఫీ 2025/26 ద్వారా అతను ఢిల్లీ జట్టు తరఫున పునరాగమనం చేయనున్నాడు. అయితే, దీనికి ముందు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మెడికల్ క్లియరెన్స్ పొందడం తప్పనిసరి.

Rishabh Pant : రిషబ్ పంత్ రీఎంట్రీ.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు సెలక్ట్ కావాలంటే ఇది చేయాల్సిందే
Rishabh Pant (1)

Updated on: Oct 07, 2025 | 9:40 AM

Rishabh Pant : భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల చివరిలో జరగనున్న రంజీ ట్రోఫీ 2025/26 ద్వారా అతను ఢిల్లీ జట్టు తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే, దీనికి ముందు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మెడికల్ క్లియరెన్స్ పొందడం తప్పనిసరి. సెప్టెంబర్ మధ్య నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్న పంత్‌కు, వచ్చే వారం కుడి కాలి గాయాన్ని వైద్య నిపుణులు మరోసారి పరిశీలించనున్నారు. త్వరలోనే మైదానంలోకి రావడానికి పంత్ తీవ్రంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కోలుకుంటున్న తీరును బట్టి చూస్తే, పంత్‌కు త్వరలోనే క్లియరెన్స్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైద్య బృందం పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తే.. అక్టోబర్ 25 నుంచి ఢిల్లీలో జరిగే రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండవచ్చు. అక్టోబర్ 15 న హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు సమయం సరిపోకపోవచ్చు. ఒకవేళ పంత్‌కు క్లియరెన్స్ వచ్చి, ఢిల్లీ తరఫున మంచి ప్రదర్శన చేస్తే, నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో అతను ఎంపికయ్యే అవకాశం ఉంది.

గత జూలై చివరలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి, పంత్ తన కుడి కాలి మెటాటార్సల్‌కు గాయం చేసుకున్నాడు. ఈ గాయంతో అతను 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. తర్వాత స్కానింగ్‌లో ఫ్రాక్చర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ, పంత్ మరుసటి రోజు మూన్‌బూట్‌తో స్టేడియానికి వచ్చి 54 పరుగులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సుదీర్ఘ కోలుకునే సమయం కారణంగా, అతను ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు, అక్టోబర్ 19 నుంచి పెర్త్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు.

టెస్టుల్లో భారత వైస్-కెప్టెన్ అయిన పంత్, గత ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో ఏడు ఇన్నింగ్స్‌లలో 68.42 సగటుతో 479 పరుగులు చేశాడు. లీడ్స్‌లోని హెడింగ్లీలో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో రెండు సెంచరీలు కూడా సాధించాడు. పంత్ మళ్లీ జట్టులోకి వస్తే, భారత టెస్ట్ జట్టుకు అతని అనుభవం, దూకుడు చాలా ఉపయోగపడుతుంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..