దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా టీమ్ ఇండియా విజయాల్లో వికెట్ కీపర్ అండ్ స్టార్ బ్యాటర్ రిచా ఘోష్ కీలక పాత్ర పోషిస్తోంది. లేడీ ధోనిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి జట్టులో తన ఫినిషర్ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన రిచా మొత్తం 74 పరుగులు చేసింది. కీపర్‌గా 3 క్యాచ్‌లు అందుకుంది. మొదట పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 31 పరుగులు చేసింది రిచా . దీంతో పాటు రెండు క్యాచ్‌లు పట్టడంతో పాటు ఒక స్టంపింగ్ కూడా చేసింది. ఇక బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అజేయంగా 44 పరుగులు చేసింది. ఒక క్యాచ్ కూడా అందుకుంది. ఇలా రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భతంగా ఆడి నాటౌట్‌గా నిలిచిందీ లేడీ ధోని. అంతేకాదు ఈ టోర్నీలో రిచా స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది.
కాగా బెంగాల్ వాసి అయిన రిచా.. టీమిండియా రెండో ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటోంది. గత నెలలో, ఆమె అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాలో సభ్యురాలు. ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం దక్కింది. కాగా ఇటీవల జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ టీమిండియా ధనాధన్ వికెట్ కీపర్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే.. చివరికి ఈ లేడి ధోనిని రూ. 1.90 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
Richa Ghosh, the finisher of India.
31*(20) vs Pakistan & 44*(32) vs West Indies during a tricky time in the chase, she is mastering the tough art in T20 format. pic.twitter.com/uAIaj4TRnd
— Johns. (@CricCrazyJohns) February 15, 2023
Richa Ghosh winning movement ??
Second time in rowRicha ????
What a short ???: Icc #T20WorldCup #INDvWI #RichaGhosh #TurnItUp pic.twitter.com/3kkApktu5G
— Thewomencricketworld (@Thewomencricke1) February 16, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..