యూఏఈ, ఒమన్‌లో టీ 20 ప్రపంచ కప్ సంగ్రామం నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్‌కు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్నర్ రవిచంద్రన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో భారత్ తమ జట్టను ప్రకటించింది. అందులో నలుగురు స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. అయితే జట్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యకరంగా చోటు దక్కించుకున్నాడు. ఎందుకంటే అతడు అంతర్జాతీయ వన్డే, టీ 20 చివరి మ్యాచ్‌ను 2017లో ఆడారు. అశ్విన్ ఎంపికపై కోహ్లీ మాట్లాడారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అశ్విన్ ప్రతిభను కనబరిచారని చెప్పారు.
“అశ్విన్ తన ఫామ్‌తో ఎంపిక అయ్యాడు. అతను వైట్-బాల్ క్రికెట్‌లో చాలా ధైర్యంతో బౌలింగ్ చేస్తాడు” అని ఐసీసీ నిర్వహించిన మీడియా చిట్ చట్‌లో కోహ్లీ అన్నారు. దేశీయ టీ 20 పోటీల్లో అశ్విన్ ప్రదర్శనలు బాగున్నాయని టీ 20 ప్రపంచ కప్‌లో తన ప్రతిభను చూవిస్తాడని చెప్పాడు. “గత రెండేళ్లలో మీరు ఐపీఎల్ చూసినట్లయితే, అతను కష్టమైన ఓవర్లు బౌల్ చేశాడు, అతను ఐపీఎల్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. అశ్విన్ సరైన ప్రాంతాల్లో బంతిని వెయడానికి అస్సలు వెనకడాడు. పవర్ హిట్టర్లను కూడా భయపెట్టాడు. అశ్విన్ అతని నైపుణ్యంపై నమ్మకం ఉంచాడు.” అతను బౌలింగ్ చేస్తున్న తీరు వైవిధ్యంగా ఉంది. అశ్విన్‌కు చాలా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.” కోహ్లీ చెప్పాడు.
Read Also.. T20 World Cup 2021: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై తొలిసారి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఏమన్నాడంటే?