Ravindra Jadeja: టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. టెస్టులకు జడేజా గుడ్‌బై!

|

Dec 15, 2021 | 8:25 AM

భారత క్రికెట్ జట్టులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా భారత క్రికెట్ అభిమానులను ఓ షాకింగ్ న్యూస్ కలవరపెడుతోంది.

Ravindra Jadeja: టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. టెస్టులకు జడేజా గుడ్‌బై!
Ravindra Jadeja
Follow us on

భారత క్రికెట్ జట్టులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్‌ జడేజా టెస్టు క్రికెట్‌కు గుడ్​బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితుడు వెల్లడించాడు. ఇటీవల తొడ కండరాల గాయంతో రోహిత్‌శర్మ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయిన విషయం తెలిసిందే. మరోవైపు వన్డేలకు అందుబాటులో ఉండనని విరాట్‌ కోహ్లీ బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జడ్డూ సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన తాజా సమాచారం క్రికెట్ అభిమానులను షాక్ గురిచేస్తోంది.

గత నెలలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జడ్డూ మోచేతికి గాయమైంది. అదే రీజన్‌తో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్న.. జడేజాను వీలైనంత త్వరగా  టెస్టు క్రికెట్లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు అతని తాజా నిర్ణయం జీర్ణించుకోవడం కష్టమే. ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టాప్-5లో ఉంటాడు జడేజా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అతడు అసమాన్య ప్రతిభ కనబరుస్తున్నాడు. అతను పట్టిన క్యాచ్‌లు, విసిరిన త్రోలు మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.   ఇప్పటి వరకు 57 టెస్టులాడిన జడేజా 2195 రన్స్ చేసి, 232 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గానూ జడేజా రికార్డు క్రియేట్ చేశాడు.

Also Read: ఆ సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. రైతులకు చేకూరనున్న ప్రయోజనం