RCB vs RR Highlights: బెంగళూరుపై రాజస్థాన్ గెలుపు.. రాణించిన అశ్విన్‌, కుల్దీప్‌సేన్

| Edited By: Srinivas Chekkilla

Apr 26, 2022 | 11:20 PM

RCB vs RR: ఐపీఎల్‌ 2022లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో బెంగళూరు, రాజస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

RCB vs RR Highlights: బెంగళూరుపై రాజస్థాన్ గెలుపు.. రాణించిన అశ్విన్‌, కుల్దీప్‌సేన్

ఐపీఎల్‌ 2022లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో బెంగళూరు, రాజస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల  విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లకు 115 పరుగులకే అలౌట్ అయింది.

Key Events

పటిష్టంగా రాజస్థాన్‌..

రాజస్థాన్ బౌలింగ్‌ అద్భుతంగా కొనసాగుతోంది. చాహల్‌, బౌల్ట్‌, అశ్విన్‌, చాహల్‌లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఒక బ్యాటింగ్‌ విషయంలోకూడా రాజస్థాన్‌ మంచి ఫామ్‌లో ఉంది.

బెంగళూరు బలహీనతలివే..

డు ప్లెసిస్‌ ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతుండడం, కోహ్లీ వరుసగా వైఫల్యం చెందుతుండడం బెంగళూరుకు మైనస్‌గా కనిపిస్తోంది. వీరు ఈ మ్యాచ్‌లో రాణిస్తే మ్యాచ్‌ గెలవడం అసాధ్యమేమి కాదు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Apr 2022 11:14 PM (IST)

    రాజస్థాన్‌ రాయల్స్ ఘన విజయం

    బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • 26 Apr 2022 11:07 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు 9వ వికెట్ కోల్పోయింది. సిరాజ్‌ క్యాచ్‌ ఔటయ్యాడు.


  • 26 Apr 2022 11:01 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు ఓటమి అంచులకు చేరుకుంది. 8వ వికెట్‌గా హసరంగ పెవిలియన్ చేరాడు.

  • 26 Apr 2022 10:54 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు ఏడో వికెట్‌ కోల్పోయింది. షబాజ్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 26 Apr 2022 10:35 PM (IST)

    దినేష్ కార్తిక్ ఔట్‌..

    బెంగళూరు ఆరో వికెట్‌ కోల్పోయింది. దినేష్ కార్తిక్‌ రనౌట్‌ అయ్యాడు.

  • 26 Apr 2022 10:29 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో ప్రభుదేశాయి క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 26 Apr 2022 10:20 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. పటిదారు అశ్విన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

  • 26 Apr 2022 10:06 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. గ్లెన్‌ మ్యాక్సివెల్‌ కుల్దీప్‌సేన్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

  • 26 Apr 2022 09:41 PM (IST)

    మొదటి వికెట్ డౌన్‌..

    విరాట్‌ కోహ్లీ మరోసారి నిరాశ పరిచారు. కేవలం 9 పరుగులకే పెవిలియన్‌ బాటపట్టాడు. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. దీంతో ఆర్సీబీ 9 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది.

  • 26 Apr 2022 09:22 PM (IST)

    బెంగళూరు లక్ష్యం ఎంతంటే..

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. గడిచిన మ్యాచ్‌లో ఫుల్‌ ఫామ్‌లో రాణించి రెండు సెంచరీలు చేసిన బట్లర్‌ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. జట్టులో రియాన్‌ పరాగ్‌ చేసిన 56 పరుగులే అత్యధికం కావడం విశేషం. మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఇక బెంగళూరు బౌలింగ్‌ విషయానికొస్తే.. సిరాజ్‌, హేజల్‌వుడ్‌, హససరంగ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హర్షల్‌ పటేల్‌ ఖాతాలో ఒక వికెట్‌ వేసుకున్నాడు.

  • 26 Apr 2022 09:02 PM (IST)

    మరో వికెట్ డౌన్‌..

    బెంగళూరు బౌలర్ల జోరుకు రాజస్థాన్‌ వరుస వికెట్లను కోల్పోతోంది. ట్రెంట్‌ బౌల్ట్‌ రూపంలో 7వ వికెట్‌ కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 26 Apr 2022 08:50 PM (IST)

    100 పరుగుల మార్క్‌…

    రాజస్థాన్‌ రాయల్స్‌ స్కోర్ 100 పరుగులు మార్క్‌ను చేరుకుంది. 15 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. క్రీజులో షిమ్రన్‌ (1), రియాన్‌ పరాగ్‌ (21) ఉన్నారు.

  • 26 Apr 2022 08:42 PM (IST)

    మరో వికెట్ డౌన్‌..

    రాజస్థాన్‌ రాయల్స్‌ మరో వికెట్ కోల్పోయింది. మిచెల్‌ 16 పరుగులు చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో భార్‌ షాట్‌కు ప్రయత్నించిన మిచెల్ బౌండరీ వద్ద మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 26 Apr 2022 08:25 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్‌..

    రాజస్థాన్‌ మరో వికెట్ కోల్పోయింది. 27 పరుగుల వద్ద సంజూ శాంసన్‌ అవుట్‌ అయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

  • 26 Apr 2022 07:58 PM (IST)

    కష్టాల్లోకి రాజస్థాన్‌..

    రాజస్థాన్‌ రాయల్స్‌ వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి వెళ్లింది. రెండు సెంచరీలు చేసిన బట్లర్‌ కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు. హేజల్‌వుడ్‌ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చిన బట్లర్‌ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు సాధించింది.

  • 26 Apr 2022 07:44 PM (IST)

    బెంగళూరుకు తొలి దెబ్బ..

    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి దెబ్బ తగిలింది. సిరాజ్‌ బౌలింగ్‌లో దేవదత్ పడిక్కల్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో అవుట్‌ అయ్యాడు.

  • 26 Apr 2022 07:22 PM (IST)

    హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌

    ఐపీఎల్‌లో బెంగళూరు, రాజస్తాన్‌ ఇప్పటి వరకు 26 సందర్భాల్లో తలపడ్డాయి. బెంగళూరు 13 మ్యాచ్‌లు గెలవగా.. రాజస్తాన్‌ 10 విజయాలు తన ఖాతాలో వేసుకుంది.

  • 26 Apr 2022 07:21 PM (IST)

    ఇరు జట్లు..

    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..
    ఫాఫ్‌ డుప్లెసిస్‌(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, సూయశ్‌ ప్రభుదేశాయ్‌, రాజత్‌ పాటిదర్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తిక్‌, హర్షల్‌ పటేల్‌, వనిందు హసరంగ, జోష్‌ హజల్‌వుడ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

    రాజస్థాన్‌ రాయల్స్‌..
    జోస్‌ బట్లర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్(కెప్టెన్‌), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, రియాన్‌ పరాగ్‌, మిచెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కుల్దీప్‌ సేన్, ప్రసిద్‌ కృష్ణ, యజువేంద్ర చహల్‌.

  • 26 Apr 2022 07:04 PM (IST)

    టాస్‌ గెలిచిన బెంగళూరు..

    టాస్‌ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపుంది. డ్యూ ప్రభావం కారణంగా ఛేజింగ్ చేసిన వారికే మ్యాచ్‌ విజయావకాశాలు ఎక్కువ ఉండడంతో కెప్టెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ నిర్ణయం బెంగళూరుకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

Follow us on