146 Centuries In One Frame: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పాయింట్ల పట్టికలో అన్ని జట్లు దూసుకపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్, ఒకే మ్యాచ్‌లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ ఏప్రిల్ 15, శనివారం తలపడనున్నాయి. ఇప్పటి వరకు IPLలో టైటిల్ గెలవని మూడు జట్లలో ఈ రెండు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో కఠినమైన ప్రారంభాన్ని పొందాయి. RCB తన ఓపెనింగ్ గేమ్‌లో విజయం సాధించిన తర్వాత వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయింది. అయితే టోర్నమెంట్‌లో తమ మొదటి విజయం కోసం క్యాపిటల్స్ ఎదురుచూస్తోంది. అయితే, ఈ కీలక పోరుకు ముందు సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. విరాట్ కోహ్లీ, ఢిల్లీ జట్టు కోచ్ రికీ పాంటింగ్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో అభిమానులను కనువిందు చేస్తోంది.
కోహ్లి, పాంటింగ్ కుమారుడితో సంభాషిస్తున్నట్లు ఫొటోలో కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ ఇద్దరు క్రికెటర్లు కూడా నవ్వుతూ మాట్లాడుతున్నట్లు చూడొచ్చు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులు ‘ఒకే ఫ్రేమ్‌లో 146 సెంచరీలు’ అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.
Jab Ricky Met Kohli ?
Extended Cameo: Ricky Jr ??#YehHaiNayiDilli #IPL2023 #ViratKohli #KingKohli #RCBvDC | @imVkohli | @RickyPonting pic.twitter.com/0LegGmLtga— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2023
RCBకి ఇది ఒక ముఖ్యమైన గేమ్. వరుసగా రెండు పరాజయాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. ఇంకా ఖాతా తెరవని క్యాపిటల్స్‌కు ఇది కీలక మ్యాచ్. స్టార్ ప్లేయర్‌లు ఫామ్‌లో లేకపోవడం, తరచూ బ్యాటింగ్‌లో బోల్తా పడడం, కొన్ని తప్పుడు వ్యూహాల కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ నష్టపోయింది. మరి ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి విజయాల ఖాతాను తెరుస్తుందా లేదా అనేది చూడాలి.
146 centuries in one frame ? pic.twitter.com/F13mUqPEcV
— feryy (@ffspari) April 13, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..