RCB అభిమానులకు ఒక రోజు సెలవు ఇవ్వాలి! ఏకంగా సీఎంకే లేఖ రాసిన అభిమాని!

RCB అభిమాని శివానంద్ మల్లన్నవర్, RCB ఐపీఎల్ 2025 ఫైనల్ గెలిస్తే కర్ణాటకలో ఒక రోజు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశాడు. ఈ విజయం 18 ఏళ్ల కల నెరవేర్చడం అని, ఆ రోజును "RCB అభిమానుల పండుగ"గా జరుపుకోవాలని కోరాడు.

RCB అభిమానులకు ఒక రోజు సెలవు ఇవ్వాలి! ఏకంగా సీఎంకే లేఖ రాసిన అభిమాని!
Rcb Fan Letter

Updated on: May 30, 2025 | 12:41 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా గురువారం జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో పంజాబ్‌ను ఓడించిన ఆర్సీబీ భారీ విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు, కప్ గెలవాలనే తమ కలను చేరుకోవడానికి ఇంకా ఒక అడుగు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఓ ఆర్సీబీ అభిమాని ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు. ఒక వేళ ఫైనల్లో ఆర్సీబీ గెలిస్తే.. జూన్‌ 4న ‘ఆర్సీబీ అభిమానుల పండుగ’గా ప్రకటించి, ఒక రోజు సెలవు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశాడు. బెల్గాం జిల్లాలోని గోకాక్‌కు చెందిన శివానంద్ మల్లన్నవర్ అనే యువకుడు ఆర్సీబీ అభిమాని. ఆర్సీబీ అంటే అతనికి పిచ్చి అభిమానం.

అయితే ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకొని.. హాట్‌ ఫేవరేట్‌లా కనిపిస్తున్న తరుణంలో ఆర్సీబీ ఫైనల్‌ గెలిస్తే.. సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని కోరాడు. అన్ని జిల్లాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అభ్యర్థిస్తూ వారు ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్సీబీ ఐపిఎల్ కప్ గెలిస్తే, ప్రభుత్వం ఆ రోజును ‘కర్ణాటక రాష్ట్ర ఆర్‌సిబి అభిమానుల పండుగ’గా అధికారికంగా ప్రకటించి, ప్రతి సంవత్సరం సెలవు ఇవ్వాలి.

RCB అభిమానుల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నందున, ప్రతి జిల్లాలో కర్ణాటక రాజ్యోత్సవాన్ని జరుపుకునే విధంగానే RCB అభిమానుల పండుగను జరుపుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం వీలు కల్పించాలని మేం అభ్యర్థిస్తున్నాం. ఈ విషయాన్ని పరిశీలించి సెలవుదినం, RCB అభిమానుల ఉత్సవానికి అనుమతి ఇవ్వాలని మేం అన్ని RCB అభిమానుల తరపున కర్ణాటక ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం అని అతను లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. మరి దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..