Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ అశ్విన్ పాత మరో రికార్డును క్రియేట్ చేసిండు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్లు తీసిన యాష్.. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. తాజాగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అతడు జహీర్ ఖాన్‌ను అధిగమించాడు.
నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్లు తీసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. మొత్తం వికెట్ల సంఖ్య 599కి పెంచుకున్నాడు. జహీర్ 597 వికెట్లతో అశ్విన్ తర్వాత స్థానంలో ఉన్నాడు. 28వ ఓవర్లో ఒల్లీ పోప్ వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్‌ను అందుకున్నాడు యాష్.
ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో హర్భజన్ సింగ్(707), కపిల్ దేవ్(687) ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో అశ్విన్ మరో మూడు వికెట్లు తీస్తే 400 వికెట్ల క్లబ్లో చేరుతాడు.
నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా సత్తా చూపించింది. పింక్ బాల్‌తో ఆడిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. రెండింటిలో తన పవర్ చూపించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో కూడా కోహ్లీ సేన అదరగొట్టింది. డే అండ్ నైట్ టెస్ట్ తొలి రోజు మ్యాచ్‌పై పట్టు బిగించేంది. టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ఆట మొదలైన కాసేపటికే అక్షర్, అశ్విన్ వేసిన బంతులకు ఇంగ్లీష్ టీమ్ ఆటను చూట్టేశారు.
నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 99/3తో నిలిచింది. అజింక్య రహానె (1/ బ్యాటింగ్), రోహిత్ శర్మ (57/బ్యాటింగ్) ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లాండ్ 112కు ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా మరో 13 పరుగుల చేయాల్సి ఉంది.
అయితే అంతకు ముందు టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. శుబ్‌మన్ గిల్(11), చతేశ్వర్ పుజారా(0)ల వికెట్లను వరుస ఓవర్లలో చేజార్చుకుంది. జోఫ్రా ఆర్చర్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి గిల్ ఔట్ కాగా, ఆపై వచ్చిన పుజారా సైతం నిరాశపరిచాడు. స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ ఐదో బంతికి పుజారా వికెట్లు ముందు దొరికిపోయాడు.
నాలుగు బంతులు ఆడిన పుజారా పరుగులేమీ చేయకుండా ఎల్బీగా వెనుదిరిగాడు. 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. అయితే కోహ్లీ (27/ 58 బంతు) ఔటయ్యాడు. జాక్ లీచ్ వేసిన 32.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు.
Wickets in back-to-back overs!
England have lost Ollie Pope and Ben Stokes soon after the tea break.
They are in trouble at 81/6.#INDvENG ➡️ https://t.co/0unCGUOHmI pic.twitter.com/2mmCDq45F1
— ICC (@ICC) February 24, 2021