భారత వనితలకు వజ్రాల నెక్లెస్‌లు.. కొత్త వెలుగులు తెచ్చారంటూ కానుకలు.. చూస్తే ఔరా అనాల్సిందే..

Team India Women Players: ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు గోవింద్ ఢోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ప్రపంచ టోర్నీలో ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, ఒకవేళ మన అమ్మాయిలు కప్ సాధిస్తే జట్టులోని సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే సోలార్ ప్యానెళ్లను కూడా ఇస్తానని తెలిపారు.

భారత వనితలకు వజ్రాల నెక్లెస్‌లు.. కొత్త వెలుగులు తెచ్చారంటూ కానుకలు.. చూస్తే ఔరా అనాల్సిందే..
Team India Women Players

Updated on: Nov 04, 2025 | 8:16 AM

Team India Womens: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో విజయకేతనం ఎగరవేసిన టీమిండియా ప్రశంసల వర్షం కురుస్తోంది. కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల కలని నిజం చేస్తూ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన అమ్మాయిల జట్టుకు ప్రత్యేక కానుకలు ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు సభ్యులకు సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలాకియా ప్రత్యేక కానుకలు ప్రకటించారు. మహిళా జట్టుకు వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు గోవింద్ ఢోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ప్రపంచ టోర్నీలో ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, ఒకవేళ మన అమ్మాయిలు కప్ సాధిస్తే జట్టులోని సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే సోలార్ ప్యానెళ్లను కూడా ఇస్తానని తెలిపారు.

దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలుగుమయం కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు భారత మహిళా జట్టు విజేతగా నిలవడంతో గోవింద్‌ ఢోలాకియా తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరపున వజ్రాల ఆభరణాలు, సోలార్‌ ప్యానెళ్లను అందిస్తానని వెల్లడించారు.

శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన ఢోలాకియా గతంలోనూ పలుమార్లు ఇలా అరుదైన కానుకలు ఇచ్చారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఉద్యోగులకు బహుమతులు ఇస్తుంటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..