RCB vs RR IPL Match Result: క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఓటమిని చవి చూసిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో టైటిల్ పోరులో స్థానం దక్కించుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడే అవకాశాన్ని సొంతం చేసుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలో ఛేదించింది. బట్లర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 60 బంతుల్లోనే 10 ఫోర్‌లు, 6 సిక్స్‌లతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తర్వాత యశస్వీ జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23)తో బట్లర్‌కు జతకలిశారు. ఇక బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు, హసరంగ ఒక వికెట్ పడగొట్టారు.
ఇదిలా ఉంటే అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 10 ఓవర్ల వరకు నిధానంగా సాగింది. అదే సమయంలో రాజస్థాన్ బౌలర్ల దాటికి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ చాలా త్వరగా వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్లు విరాట్ 8 బంతుల్లో 7 పరుగులు చేయగా.. డూ ప్లెసిస్ 27 బంతుల్లో 25 పరుగులు చేశాడు. వీరు ఔట్ అయ్యే సమయానికి జట్టు స్కోర్ 50 కి అటు ఇటుగా మాత్రమే ఉంది. ఆ తరువాత వచ్చిన రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ విజృంభించడంతో టీమ్ స్కోర్ పెరిగింది. రజత్ పాటి దార్ 42 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 58 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం క్లిక్ చేయండి..