RR vs RCB IPL 2022 Match Result: కుల్దీప్, అశ్విన్‌ల దెబ్బకు ఆర్‌సీబీ ఢమాల్.. ఆరో విజయంతో అగ్రస్థానం చేసిన రాజస్థాన్..

|

Apr 27, 2022 | 12:02 AM

ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ టీం 8 మ్యాచ్‌లు ఆడగా, 6 గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడింది. అదే సమయంలో 9 మ్యాచ్‌ల్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

RR vs RCB IPL 2022 Match Result: కుల్దీప్, అశ్విన్‌ల దెబ్బకు ఆర్‌సీబీ ఢమాల్.. ఆరో విజయంతో అగ్రస్థానం చేసిన రాజస్థాన్..
Rr Vs Rcb Ipl 2022 Match Result
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా 39వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RR Vs RCB) తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీం 29 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ టీం.. పూర్తి ఓవర్లు కూడా ఆడలేక 115 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఒక్క ఆటగాడు కూడా 25 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడం విశేషం. ఫాఫ్ డు ప్లెసిస్(Faf Du Plessis) (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్థాన్ తరపున రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టి బెంగళూర్‌ను దారుణంగా దెబ్బతీశారు. శాంసన్ నేతృత్వంలోని జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కాగా, ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ టీం 8 మ్యాచ్‌లు ఆడగా, 6 గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడింది. అదే సమయంలో 9 మ్యాచ్‌ల్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ అత్యధికంగా 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆర్‌సీబీ తరపున జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తమ ఖాతాని కూడా సమం చేసింది. టోర్నమెంట్‌లో ఇరు జట్ల మధ్య ఇది రెండో ఎన్‌కౌంటర్. ఇందులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించగా, అంతకుముందు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారీ రికార్డు సృష్టించిన ఆర్ అశ్విన్..

ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన 8వ ఆటగాడిగా నిలిచాడు. రజత్ పాటిదార్‌ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. హర్భజన్ సింగ్ తర్వాత ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన రెండో ఆఫ్‌స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అశ్విన్.. తన 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. రజత్ పాటిదార్ (16), షాబాజ్ అహ్మద్ (17), సుయాష్ ప్రభుదేశాయ్ (2)లను అశ్విన్ అవుట్ చేశాడు.

చెలరేగిన కుల్దీప్ యాదవ్..

ప్లేయింగ్ XIలో పునరాగమనం చేసిన కుల్దీప్ సేన్.. బెంగళూరు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఆర్ఆర్ యువ పేసర్ ఫాఫ్ డు ప్లెసిస్ (23), గ్లెన్ మాక్స్‌వెల్ (0), వనిందు హసరంగా (18) వికెట్లు తీశాడు. అతను రెండు వరుస బంతుల్లో ఫాఫ్, మాక్స్‌వెల్‌లను అవుట్ చేసి, బెంగళూర్‌ను బెదరగొట్టాడు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), హర్షల్ పటేల్, వనిందు హస్రంగ, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ముంబై, సీఎస్‌కే జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయా.? ఇవిగో లెక్కలు.!

RCB vs RR Highlights: బెంగళూరుపై రాజస్థాన్ గెలుపు.. రాణించిన అశ్విన్‌, కుల్దీప్‌సేన్