గత ఆగస్ట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కంకషన్ కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అతను జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. టీమ్ ఇండియాకు దూరమైన తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సలహా మేరకు వ్యవహరించి మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నట్లు మయాంక్ చెప్పాడు.
“గత సంవత్సర కాలంగా నా బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.” మయాంక్ చెప్పాడు. ” ద్రవిడ్ ఎల్లప్పుడూ తనను తాను అర్థం చేసుకోవడం, మానసిక అంశం గురించి మాట్లాడుతుంటాడు. దానిపై పని చేయడం వల్ల విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.” అని అన్నాడు. మేము ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేశాం. టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం.” అని వివరించాడు.
మయాంక్ అగర్వాల్ న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రాణించాడు. ముంబైలో జరిగిన రెండో టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 150 రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా 372 పరుగులతో విజయం సాధించింది.
Read Also.. Neeraj Chopra Birth Day: వారందరికి ధన్యవాదాలు.. వీడియో పోస్ట్ చేసిన నీరజ్ చోప్రా..