Video: నువ్వు దేవుడివే సామీ.. ఒక్క బంతికి 2 డీఆర్‌ఎస్‌లు.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేసిన అశ్విన్..

|

Jun 15, 2023 | 5:39 PM

R Ashwin DRS in TNPL: తిరుచ్చి ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అది కూడా టీమిండియా స్టార్ బౌలర్ అశ్విన్ వేయడంతో.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ ఓవర్ చివరి బంతిని బ్యాట్స్‌మెన్ రాజ్‌కుమార్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

Video: నువ్వు దేవుడివే సామీ.. ఒక్క బంతికి 2 డీఆర్‌ఎస్‌లు.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేసిన అశ్విన్..
Ashwin Drs In Tnpl
Follow us on

జూన్ 14, బుధవారం కోయంబత్తూరులో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ తిరుచ్చి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని దిండిగల్ జట్టు తిరుచ్చిపై మరో 31 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన దిండిగల్.. తిరుచ్చి జట్టును కేవలం 120 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇందులో అశ్విన్ కూడా కీలక పాత్ర పోషించాడు. తిరుచ్చి జట్టులో ఓపెనర్ శ్రీధర్ రాజు 41 బంతుల్లో 48 పరుగులు చేశాడు.

దిండిగల్ బౌలింగ్‌లో మెరిసిన వరుణ్ చక్రవర్తి తన కోటా 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే కెప్టెన్ అశ్విన్, శరవణ్ కుమార్, సుబోత్ భాటి తలా 2 వికెట్లు తీశారు. తిరుచ్చి ఇచ్చిన 120 పరుగుల స్వల్ప స్కోరును ఛేదించిన దిండిగల్‌ ఓపెనర్ శివమ్ సింగ్ 30 బంతుల్లో 46 పరుగులు చేశాడు. కానీ, ఈ మ్యాచ్‌లో దిండిగల్ జట్టు విజయం కంటే.. ఒకే బంతికి రెండు డీఆర్‌ఎస్‌లు వాడడంతో.. వార్తల్లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

తిరుచ్చి ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అది కూడా టీమిండియా స్టార్ బౌలర్ అశ్విన్ వేయడంతో.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ ఓవర్ చివరి బంతిని బ్యాట్స్‌మెన్ రాజ్‌కుమార్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ, అశ్విన్ కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఔట్‌గా ప్రకటించాడు.

అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాట్స్‌మెన్ రాజ్‌కుమార్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. బంతి బ్యాట్‌కు తగలలేదన్న విషయం రీప్లేల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయం మార్చుకుని నాటౌట్ ఇచ్చాడు. మైదానంలోని అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్న వెంటనే అశ్విన్ మరోసారి డీఆర్ఎస్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అనంతరం ఫీల్డ్ అంపైర్ మళ్లీ థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. మళ్లీ థర్డ్ అంపైర్ రీప్లే చూసి మరోసారి తన నిర్ణయాన్ని సమర్థిస్తూ నాటౌట్ ఇచ్చాడు. మొత్తానికి అశ్విన్ అతని టీమ్‌కు సక్సెస్ రివ్యూని అందించలేకపోయాడు.

తమాషా ఏంటంటే.. తిరుచ్చి బ్యాటర్ రాజ్ కుమార్ 20వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో ఓ బౌండరీ, సిక్సర్ బాదాడు. మొత్తంగా అశ్విన్ తన 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..