AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quinton de Kock : వేలంలో ఎవరూ కొనలేదు.. సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు

Quinton de Kock :క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా ఒక చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరపున (ఢిల్లీ డేర్‌డెవిల్స్, లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్) సెంచరీలు బాదిన తొలి విదేశీ ఆటగాడిగా డికాక్ నిలిచాడు.

Quinton de Kock : వేలంలో ఎవరూ కొనలేదు.. సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
Quinton De Kock
Rakesh
|

Updated on: Apr 17, 2026 | 7:00 AM

Share

Quinton de Kock : ఐపీఎల్ 2026 వేలంలో ఏ జట్టూ పట్టించుకోని ఒక ఆటగాడు, మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఒక యోధుడు.. ఇప్పుడు మైదానంలోకి అడుగుపెట్టి రికార్డుల దుమ్ముదులిపాడు. అతనే ముంబై ఇండియన్స్ ఓపెనర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన డికాక్, అదిరిపోయే సెంచరీతో ముంబైకి భారీ స్కోరు అందించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా ఒక చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరపున (ఢిల్లీ డేర్‌డెవిల్స్, లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్) సెంచరీలు బాదిన తొలి విదేశీ ఆటగాడిగా డికాక్ నిలిచాడు. కేవలం 53 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో తన సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ సెంచరీతో డికాక్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 9వ సెంచరీని నమోదు చేశాడు. దీనివల్ల అతడు టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్-బ్యాటర్‌గా తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. అలాగే టీ20 సెంచరీల సంఖ్యలో విరాట్ కోహ్లీ, రిలీ రోసో వంటి దిగ్గజాల సరసన చేరాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, డికాక్ ఎదురుదాడికి దిగి జట్టును ఆదుకోవడం విశేషం.

రోహిత్ శర్మ గాయపడటంతో డికాక్‌కు ఈ సీజన్‌లో మొదటిసారి తుది జట్టులో అవకాశం దక్కింది. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన వేలంలో డికాక్ కేవలం 1 కోటి రూపాయల కనీస ధరకే ముంబైకి చిక్కాడు. ఇతర జట్లు ఏవీ అతనిపై ఆసక్తి చూపలేదు. గత నాలుగు మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం రాలేదు. కానీ వచ్చిన మొదటి అవకాశంలోనే తన ఫస్ట్ బాల్‌కే సిక్సర్ కొట్టి ఖాతా తెరిచిన డికాక్, అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించి విమర్శకుల నోళ్లు మూయించాడు.

డికాక్‌కు యువ బ్యాటర్ నమన్ ధీర్ అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 68 బంతుల్లోనే 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నమన్ ధీర్ కూడా 31 బంతుల్లో 50 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. వీరిద్దరి ధాటికి ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. చాహల్ ఇచ్చిన లైఫ్ లైన్ వాడుకుంటూ వీరిద్దరూ చేసిన విధ్వంసం పంజాబ్ జట్టును పీకల్లోతు కష్టాల్లో నెట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తృతీయ రోజున భారీ గ్రహాల ఛేంజ్.. వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయ్
తృతీయ రోజున భారీ గ్రహాల ఛేంజ్.. వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయ్
లక్షలు విలువైన మీ బంగారానికి.. ఇది చుక్క తగిలితే చాలు..బూడిదే!
లక్షలు విలువైన మీ బంగారానికి.. ఇది చుక్క తగిలితే చాలు..బూడిదే!
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..