Prithvi Shaw : నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలలకే పెళ్లి క్యాన్సిల్.. క్రికెటర్ పృథ్వీ షా ప్రేమకథ విషాదాంతం

Prithvi Shaw : పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలల్లోనే విడిపోయారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు డిలీట్ చేయడం, ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, ఆకృతి చేసిన పోస్టులు ఈ రూమర్లకు మరింత ఊతమిచ్చాయి. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

Prithvi Shaw  : నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలలకే పెళ్లి క్యాన్సిల్.. క్రికెటర్ పృథ్వీ షా ప్రేమకథ విషాదాంతం
Prithvi Shaw

Updated on: Jul 05, 2026 | 4:35 PM

Prithvi Shaw : భారత యువ సంచలన క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పెద్ద సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. పృథ్వీ షా, అతని కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయని, వీరిద్దరూ తమ బంధానికి స్వస్తి పలికారని నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి(2026)లోనే ఎంతో ఘనంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ జంట మధ్య ఇంతటి దూరం రావడానికి గల కారణాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆకృతి అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలలో చేసిన కొన్ని మార్పులు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్

ఈ స్టార్ కపుల్ విడిపోయారనే వార్తలకు ప్రధాన కారణం ఆకృతి అగర్వాల్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పృథ్వీ షాతో ఉన్న అన్ని ఫోటోలను తొలగించడమే. అంతేకాకుండా, మార్చి నెలలో జరిగిన తమ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను కూడా ఆమె ప్రొఫైల్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ వేదికగా తమ బంధం ముగిసిందనే సంకేతాలు ఇస్తూ, ఆమె పృథ్వీ షాను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేశారు. మరోవైపు పృథ్వీ షా కూడా ఆకృతిని అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరి బంధం తెగిపోయిందనే ప్రచారం నిజమేనని అభిమానులు నమ్ముతున్నారు.

సోషల్ మీడియాలో ఆకృతి అగర్వాల్ సంచలన పోస్ట్

ఇదిలా ఉండగా, ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన కొన్ని పోస్టుల తాలూకు స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే డిలీట్ చేసినట్లు సమాచారం. ఆ వైరల్ స్టోరీలో, “నా జీవితంలో నేను ఎన్నోసార్లు మోసపోయాను, అయినా కూడా ఇంతకాలం ఒక్క మాట కూడా మాట్లాడకుండా భరించాను. నా లైఫ్‌లో ఇంత పెద్ద నిర్ణయం (నిశ్చితార్థం) తీసుకున్న తర్వాత కూడా ఇలా జరుగుతుందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రతి పుకారు, ప్రతి మాట వంద శాతం నిజం” అని ఆకృతి రాసుకొచ్చారు. అంతేకాకుండా మరో ఫోటోను షేర్ చేస్తూ.. “వారు ఎప్పుడూ అబద్ధాలే చెబుతూ ఉంటారు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎవరీ ఆకృతి అగర్వాల్?

పృథ్వీ షా కాబోయే భార్యగా అందరికీ పరిచయమైన ఆకృతి అగర్వాల్ ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యాక్ట్రెస్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 31 లక్షల (3.1 మిలియన్) మంది ఫాలోవర్లు ఉన్నారు. మోడలింగ్‌ రంగంలో రాణించిన ఆమె, తెలుగులో వచ్చిన త్రిముఖ అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. దీనితో పాటు ఆమెకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో ఆమె తన లైఫ్‌స్టైల్ వ్లాగ్స్, ఫ్యాషన్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. పృథ్వీ షా, ఆకృతిలు నిశ్చితార్థానికి ముందు చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. పలుమార్లు వీరిద్దరూ జంటగా కెమెరాల కంటికి చిక్కారు.

విబేధాల రూమర్లపై ఇంకా నోరు విప్పని పృథ్వీ షా

సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నప్పటికీ, ఈ వివాదంపై అటు పృథ్వీ షా గానీ, ఇటు ఆకృతి అగర్వాల్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆకృతి పోస్టులు చూస్తుంటే పృథ్వీ షా ఆమెను మోసం చేశాడనే అర్థం వస్తోందని కొందరు అంటుండగా, అసలు విషయం తెలియకుండా ఒకరిని బ్లేమ్ చేయలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉన్న ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగిందో తెలియక నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. మరి ఈ బంధం పూర్తిగా ముగిసిందా లేక తాత్కాలిక విభేదాలా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us