Prithvi Shaw: టీమిండియా యంగ్ క్రికెటర్‌ పృథ్వీషాపై దాడి.. రెండోసారి సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించాడని..

|

Feb 16, 2023 | 1:57 PM

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌పై పృథ్వీ షాపై కొందరు దాడి చేశారు. రెండోసారి సెల్ఫీ ఇవ్వనందుకు గానూ అతను ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వారు. దాడి సమయంలో కారులో పృథ్వీషాతో పాటు అతని ఫ్రెండ్‌ కూడా ఉన్నాడు.

Prithvi Shaw: టీమిండియా యంగ్ క్రికెటర్‌ పృథ్వీషాపై దాడి.. రెండోసారి సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించాడని..
Prithvi Shaw
Follow us on

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌పై పృథ్వీ షాపై కొందరు దాడి చేశారు. రెండోసారి సెల్ఫీ ఇవ్వనందుకు గానూ అతను ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వారు. దాడి సమయంలో కారులో పృథ్వీషాతో పాటు అతని ఫ్రెండ్‌ కూడా ఉన్నాడు. అయితే ప్రమాదంలో పృథ్వీషాతో పాటు అతని ఫ్రెండ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఓషివారా పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాంద్రా వెస్ట్‌కు చెందిన వ్యాపారవేత్త ఆశిష్ యాదవ్ తన స్నేహితుడు క్రికెటర్ పృథ్వీ షాతో కలిసి బుధవారం మధ్యాహ్నం శాంతా క్రజ్ విమానాశ్రయం సమీపంలోని సహారా స్టార్ హోటల్‌లో విందుకు వెళ్లారు. ఆ సమయంలో నిందితులు సనా గిల్, షోబిత్ ఠాకూర్ వారి అనుచరులు పృథ్వీ షాతో సెల్ఫీలు దిగాలని పట్టుబట్టారు. ముచ్చటపడి అడగడంతో కాదనలేక వారితో సెల్ఫీలు దిగాడు. అయితే వారు మళ్లీ మళ్లీ సెల్ఫీలు అడుగుతూ తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇంతలో హోటల్‌ మేనేజర్‌ జోక్యం చేసుకుని గిల్, ఠాకూర్, ఇతరులను హోటల్‌ నుంచి బయటకు పంపించేశారు.

అయితే అక్కడితో ఆగని నిందితులు పృథ్వీ, ఆశిష్‌ యాదవ్‌తో మళ్లీ గొడవకు దిగారు. వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును వెంబడించారు. బేస్‌బాల్‌ స్టిక్‌తో పాటు కారు ముందు, వెనక అద్దాలను పగలగొట్టారు. ఈ ఘటనపై ముంబై పోలీసులన ఆశ్రయించాడు ఆశిష్‌. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సదరు నిందితులపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..