Prasidh Krishna: 24 ఏళ్ల చరిత్ర తిరగరాసిన ప్రసిద్ధ్ కృష్ణ.. ధోని అడ్డాలో నంబర్ వన్ బౌలర్‌గా జెండా పాతేశాడు!

ప్రసిద్ధ్ కృష్ణ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్ల హాల్ సాధించాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి, 24 ఏళ్ల అజిత్ అగార్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Prasidh Krishna: 24 ఏళ్ల చరిత్ర తిరగరాసిన ప్రసిద్ధ్ కృష్ణ.. ధోని అడ్డాలో నంబర్ వన్ బౌలర్‌గా జెండా పాతేశాడు!
Prasidh Krishna

Updated on: Jun 20, 2026 | 6:53 PM

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సంచలన బౌలింగ్‌తో అదరగొట్టాడు. పవర్ ప్లేలో నాలుగు వికెట్లతో దుమ్మురేపిన ప్రసిద్ధ్, మొత్తంగా 5 వికెట్ల హాల్ సాధించాడు. ఏ బౌలర్‌కైనా ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ దక్కడం అనేది చాలా స్పెషల్. అయితే ఈ ఐదు వికెట్ల హాల్‌తో ప్రసిద్ధ్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకొని, కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 24 ఏళ్లుగా చెక్కుచెదరని ఓ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వన్డే క్రికెట్ హిస్టరీలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 24 ఏళ్ల క్రితం ఇదే చెన్నై గ్రౌండ్‌లో టీమిండియా తరఫున ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కలిగి ఉన్నాడు. 2002 జనవరి 25న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అగార్కర్ 9 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. చెన్నై గ్రౌండ్‌లో టీమిండియా తరఫున ఇదే అత్యుత్తమ బౌలింగ్. అయితే అగార్కర్ కంటే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌ను ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 6.4 ఓవర్లలో 4 వికెట్లు, పాకిస్థాన్ బౌలర్ అకిబ్ జావిద్ 10 ఓవర్లలో 6.10 ఎకానమీతో 5 వికెట్లు, వెస్టిండీస్ బౌలర్ రాంపాల్ 10 ఓవర్లలో 5.10 ఎకానమీతో 5 వికెట్లు తీసి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌‌ను కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ టాప్ 5 బౌలర్లను ప్రసిద్ధ్ కృష్ణ దాటేశాడు.

చెన్నై అనగా ఇప్పుడున్న క్రికెట్ జనరేషన్‌కి గుర్తుకు వచ్చే పేరు ధోని. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉన్న చెపాక్, ఆ టీమ్‌కు ఫేస్‌గా ఉన్న ధోనికి కూడా అది హోమ్ గ్రౌండ్ లాంటిదే. అలా ధోని అడ్డాలో వన్డే క్రికెట్‌లో ప్రసిద్ధ్ కృష్ణ నంబర్ వన్ బౌలింగ్ ఫిగర్స్ క్రియేట్ చేశాడు. 8.2 ఓవర్లలో కేవలం 2.72 ఎకానమీతో 5 వికెట్ల హాల్ సాధించాడు. నిజానికి ఇది మామూలు రికార్డ్ కాదు. ప్రసిద్ధ్ నెలకొల్పిన ఈ రికార్డ్ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని చెప్పొచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us