Narendra Modi: గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెటర్లకు లేఖ రాసిన ప్రధాని మోడీ..

73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Narendra Modi: గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెటర్లకు లేఖ రాసిన ప్రధాని మోడీ..
Pm Modi

Updated on: Jan 26, 2022 | 4:35 PM

73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇద్దరు పెద్ద క్రికెటర్లకు ప్రధాని మోడీ లేఖ రాశారు. భారతదేశంతో వారి బలమైన సంబంధాలను ప్రశంసించారు. యూనివర్స్ బాస్‌గా ప్రసిద్ధి చెందిన క్రిస్ గేల్‌(chris gayle)కు ప్రధాని మోడీ లేఖ రాశారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, గొప్ప ఫీల్డర్ జాంటీ రోడ్స్‌(Jonty Rhodes)కు కూడా ఇదే లేఖ వెళ్లింది.

ప్రధాని మోడీ నుంచి అందిన లేఖకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ క్రిస్ గేల్, ’73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను భారతదేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ‘ఈ రోజు ఉదయం నేను నిద్ర లేవగానే, ప్రధాని మోడీ నుండి నాకు వ్యక్తిగత సందేశం వచ్చింది. అందులో నాకు, భారతీయ ప్రజలకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల గురించి ప్రస్తావించారు.’ గేల్ తెలిపాడు.

ప్రధాని మోడీ నుంచి వచ్చిన లేఖను జాంటీ రోడ్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ, ‘నరేంద్ర మోడీ జీ మీ మాటలకు ధన్యవాదాలు. నేను ఇండియా వచ్చినప్పుడల్లా చాలా నేర్చుకున్నాను. నా కుటుంబం మొత్తం భారత్‌తో కలిసి గణతంత్ర వేడుకలు జరుపుకుంటోంది.’జై హింద్’ అని అన్నాడు. జాంటీ రోడ్స్ తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టాడు. జాంటీ తరచుగా భారతదేశంలోనే ఉంటాడు. అతను ఐపీఎల్‌లో చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్‌తో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్‌లో కూడా చేరాడు.

అదే సమయంలో క్రిస్ గేల్ కూడా IPL ప్రతి సీజన్‌లో భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. భారతీయ గాయకులతో గేల్ వీడియో సాంగ్స్ కూడా చేశాడు. అయితే ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొనకూడదని క్రిస్ గేల్ నిర్ణయించుకున్నాడు.

Read Also.. Icc Rankings: ఐసీసీ ర్యాకింగ్స్​లో 15వ స్థానానికి శిఖర్ ధావన్.. టాప్ రెండు, మూడు స్థానాల్లో విరాట్, రోహిత్..