ఇటీవల నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో పూర్తయిన తొలి వన్డే అనంతరం సీలార్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. గత రెండేళ్లుగా సీలార్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు అదే కారణమైంది. 2011 ప్రపంచ కప్‌లో పీటర్ సీలార్ బాగా పాపులారిటీని సంపాదించాడు. ఆ సమయంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్, సెహ్వాగ్‌ల వికెట్లను తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
18 ఏళ్ళ వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పీటర్ సీలార్.. 2009 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్ విజయం సాధించడంలో హీరోగా మారాడు. ఆ సమయంలో జట్టుకు విజయాన్ని అందించడంలో సీలార్ కీలక పాత్ర పోషించాడు. కాగా, మొత్తం 57 వన్డే మ్యాచ్‌లు ఆడిన పీటర్ సీలార్ 57 వికెట్లు తీయగా.. 77 టీ20 మ్యాచ్‌లలో 58 వికెట్లు పడగొట్టాడు. అటు సీలార్ ఎకానమీ టీ20లో 6.83, వన్డేలలో 4.67గా ఉంది.
? ANNOUNCEMENT
Captain Pieter Seelaar announces his retirement
from international cricket due to persistent back injury.More ➡️ https://t.co/tP9bffXDhc#ThankyouPieter ♥️ pic.twitter.com/pnSAHisAmx
— Cricket?Netherlands (@KNCBcricket) June 19, 2022