IND vs NZ: రాంచీలో రెండో టీ20పై నీలిమేఘాలు.. హైకోర్టులో పిల్.. ఎందుకో తెలుసా?

|

Nov 18, 2021 | 8:38 PM

India Vs New Zealand: ప్రస్తుతం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. దీనిలో భాగంగా రెండవ మ్యాచ్ రాంచీలోని JSCA క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

IND vs NZ: రాంచీలో రెండో టీ20పై నీలిమేఘాలు.. హైకోర్టులో పిల్.. ఎందుకో తెలుసా?
Ind Vs Nz
Follow us on

India Vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్ నవంబర్ 19, శుక్రవారం రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌పై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ నిర్వహణపై జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌ను వాయిదా వేయాలని లేదా స్టేడియంలో సగం సామర్థ్యంతో మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

శుక్రవారం జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లోని JSCA స్టేడియంలో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య సిరీస్‌లోని రెండవ టీ20 మ్యాచ్‌లో ప్రేక్షకులకు 100శాతం సీట్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ హైకోర్టుకు చెందిన న్యాయవాది ధీరజ్ కుమార్ జార్ఖండ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 100 శాతం సామర్థ్యంతో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు మినహాయింపును న్యాయవాది వ్యతిరేకించారు.

రాష్ట్రంలోని దేవాలయాలు, అన్ని కోర్టులు, ఇతర కార్యాలయాలు కూడా 50 శాతం మంది సిబ్బందితో కరోనా వైరస్‌కు సంబంధించి పని చేస్తున్నప్పుడు, 100 శాతం సామర్థ్యం ఉన్న క్రికెట్ స్టేడియంను ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ నియమం ప్రకారం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. రేపటి మ్యాచ్‌ను వాయిదా వేయాలని లేదా 100 శాతం సామర్థ్యంతో స్టేడియం వినియోగాన్ని నిషేధించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలని న్యాయవాది కోర్టులో ప్రత్యేక అభ్యర్థన కూడా చేశారు. తద్వారా విచారణ త్వరగా నిర్వహించడనికి వీలవుతుందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేసేందుకు వీలుంది.

రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ వర్సెస్ భారతదేశం మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం స్టేడియంలోని 50 శాతం సీట్లను మాత్రమే బుక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించి, అన్ని సీట్లను కేటాయించింది. భారత్-న్యూజిలాండ్ క్రికెట్ సిరీస్‌లోని టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండవ మ్యాచ్ శుక్రవారం ఇక్కడ జరగనుంది.

Also Read: India vs New Zealand: కివీస్ తరపున ఆడుతోన్న మరో భారతీయడు.. సచిన్, ద్రవిడ్‌ల పేర్లను తనలో భాగం చేసుకున్న ఆటగాడేవరో తెలుసా?

IPL 2022: మెగా వేలంలో డివిలియర్స్, మ్యాక్స్‌వెల్.? ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ వీరేనా.!