IND vs PAK : భారత్-పాక్ మ్యాచ్ వివాదం.. ఏకంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీనే టార్గెట్ చేసిన పీసీబీ

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య కరచాలనం వివాదం జరిగిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ 2025 మ్యాచ్ రిఫరీల ప్యానల్ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ కౌంటర్‌పార్ట్‌లతో హ్యాండ్ షేక్ చేయకుండా దూరంగా ఉన్నారు.

IND vs PAK  : భారత్-పాక్ మ్యాచ్ వివాదం.. ఏకంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీనే టార్గెట్ చేసిన పీసీబీ
No Handshake Row

Updated on: Sep 15, 2025 | 4:44 PM

IND vs PAK : ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత చోటుచేసుకున్న నో-హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ 2025 మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌, పాక్‌ను ఓడించిన తర్వాత భారత ఆటగాళ్లు హ్యాండ్ షేక్ చేయకుండా వెళ్లిపోయారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే విక్టరీ తర్వాత నేరుగా మైదానం నుంచి బయటకు వెళ్లిపోయారు.

మ్యాచ్ రిఫరీపై పీసీబీ ఆగ్రహం

భారత జట్టుపై ఫిర్యాదు చేసిన పీసీబీ, ఇప్పుడు మ్యాచ్ రిఫరీపై కూడా చర్యలకు దిగింది. “ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు సంబంధించిన ఎంసీసీ (MCC) చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుండి మ్యాచ్ రిఫరీని తక్షణమే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది” అని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ క్రిక్‌బజ్ ద్వారా ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

అండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేయడానికి కారణం, టాస్ సందర్భంగా మ్యాచ్ రిఫరీ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాను భారత కెప్టెన్ సూర్యకుమార్‌తో షేక్ హ్యాండ్ చేయవద్దని కోరారని ఆరోపణలు రావడమే. ఈ ప్రవర్తనపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

భారత్‌పై పీసీబీ ఫిర్యాదు

“భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేయకపోవడంపై జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భావించారు. దీనికి నిరసనగా మేము మా కెప్టెన్‌ను మ్యాచ్ తర్వాత జరిగే కార్యక్రమానికి పంపించలేదు” అని పీటీఐ నివేదించిన పీసీబీ ప్రకటనలో పేర్కొంది.

టాస్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత సూర్యకుమార్ అతనితో కరచాలనం చేయలేదు. పాకిస్థాన్ జట్టు షాహీన్ షా అఫ్రిది చివరిలో మెరుపులు మెరిపించిన తర్వాత కేవలం 127/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ఏడు వికెట్లు, 25 బంతులు మిగిలి ఉండగానే 128 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. సూర్య కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి 37 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేసి, చివరిలో సిక్స్ కొట్టాడు. దీని తర్వాత అతను, దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. పాకిస్థాన్ జట్టుతో కరచాలనం చేయలేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..