India vs Pakistan: రూ. 57 బిలియన్ల ప్లాన్‌.. షాకిచ్చిన ఐసీసీ.. బొక్కబోర్లాపడిన పాకిస్థాన్

|

Apr 11, 2022 | 10:44 AM

నాలుగు దేశాల మధ్య టోర్నీ నిర్వహించాలన్న రమీజ్ రాజా ప్రతిపాదనతో పాటు పలు అంశాలతో కూడిన ఐసీసీ బోర్డు రెండు రోజుల సమావేశం ఆదివారం దుబాయ్‌లో ముగిసింది.

India vs Pakistan: రూ. 57 బిలియన్ల ప్లాన్‌.. షాకిచ్చిన ఐసీసీ.. బొక్కబోర్లాపడిన పాకిస్థాన్
India Vs Pakistan
Follow us on

ప్రపంచకప్, ఆసియాకప్ మినహా మరే ఇతర టోర్నీలోనైనా భారత్ -పాకిస్థాన్(India vs Pakistan) మధ్య సిరీస్ జరుగుతుందన్న ఆశలు ప్రస్తుతానికి ముగిశాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా(PCB President Ramiz Raja) చాలా రోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ల కోసం నాలుగు దేశాల మధ్య సిరీస్‌ను ప్రారంభించాలని మాట్లాడుతున్నారు. ఇదే విషయంపై ఎన్నో కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. ఐసీసీని కూడా ఈ విషయంలో ఒప్పిస్తానంటూ మాట్లాడాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నాలుగు దేశాల టోర్నీ కోసం రమీజ్ రాజా చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఏప్రిల్ 10 ఆదివారం జరిగిన ICC ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తిరస్కరించింది.

నాలుగు దేశాల మధ్య టోర్నీ నిర్వహించాలన్న రమీజ్ రాజా ప్రతిపాదనతో పాటు పలు అంశాలతో కూడిన ఐసీసీ బోర్డు రెండు రోజుల సమావేశం ఆదివారం దుబాయ్‌లో ముగిసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, బహుళ-దేశాల టోర్నమెంట్లలో ఐసీసీ టోర్నమెంట్లు లేదా ట్రై-సిరీస్ మాత్రమే ఆడాలనే నిబంధన ఉంది. ఇటువంటి పరిస్థితిలో, 4 జట్ల టోర్నమెంట్ ఇప్పటి వరకు నిర్వహించలేకపోయింది. కానీ, పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రాజా ఈ దిశగా ప్రయత్నించి, ఘెరంగా విఫలమయ్యాడు.

ఆఫర్ ఎందుకు తిరస్కరించారంటే?

బోర్డు మీటింగ్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా ప్లాన్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంలో, ICC బోర్డు సభ్యుడు వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ, ICC ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ (F&CA) ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉంది. MPA (సభ్యుల భాగస్వామ్య ఒప్పందం) ఏ సభ్య దేశాన్ని మూడు కంటే ఎక్కువ దేశాల టోర్నమెంట్‌ని నిర్వహించడానికి అనుమతించదని మనకు తెలుసు. ఇటువంటి ప్రణాళిక ప్రధాన ICC టోర్నమెంట్‌లపై (ODI, T20 ప్రపంచ కప్) ప్రభావం చూపుతుంది.

అనుకూలంగా లేని బీసీసీఐ..

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నాలుగు దేశాల టోర్నమెంట్ పట్ల పెద్దగా ఉత్సాహం చూపలేదు. బీసీసీఐ తన ఫుల్ షెడ్యూల్‌లో నాలుగు దేశాల టోర్నమెంట్‌లో ఆడబోదని మొదటి నుంచి స్పష్టంగా చెబుతోంది. ద్వైపాక్షిక కట్టుబాట్లను నెరవేర్చడంపై భారత బోర్డు ప్రాధాన్యతనిస్తుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB)కి చెందిన టామ్ హారిసన్ కూడా నాలుగు దేశాల టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రణాళికలను స్వతంత్రంగా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారని నివేదికలు ఉన్నాయి. అయితే బోర్డు సమావేశంలో మాత్రం ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు. కాగా, ఈ ఏడాది ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడనున్నాయి.

అసలు ప్లాన్ ఏమిటి?

ఈ ప్లాన్‌ను కొన్ని వారాల క్రితం పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా వెల్లడించారు. అతను పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో సహా ICC ఆధ్వర్యంలో నాలుగు దేశాల వార్షిక T20 లేదా ODI టోర్నమెంట్ కోసం శ్వేతపత్రాన్ని సిద్ధం చేశాడు. దీనివల్ల ఐసీసీకి వచ్చే ఐదేళ్లలో 750 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 57 బిలియన్లు) రాబడి రావచ్చని, అందులో ఎక్కువ భాగాన్ని ఈ నాలుగు దేశాలకు అందించవచ్చని ఆయన అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Also Read: SRH vs GT Playing XI IPL 2022: గుజరాత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో వీరికి చోటు?

3 మ్యాచ్‌ల్లో 551 పరుగులు.. తుఫాన్ బ్యాటింగ్‌తో బౌలర్ల ఊచకోత.. ఈ రూ. 2 కోట్ల ప్లేయర్‌ విలన్‌గా మారాడా?