Team India: గిల్ సేనను చూస్తుంటే భయమేస్తోంది..: కావ్యపాప కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

Pat Cummins Mocks Edgbaston Pitch: శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ సాధించిన అద్భుత విజయంపై పాట్ కమిన్స్ చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం పిచ్‌పై వ్యాఖ్య మాత్రమే కాకుండా, భారత బ్యాట్స్‌మెన్‌ల అద్భుత ప్రదర్శనకు పరోక్ష ప్రశంసగా కూడా భావించవచ్చు.

Team India: గిల్ సేనను చూస్తుంటే భయమేస్తోంది..: కావ్యపాప కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
Pat Cummins Mocks Edgbaston Pitch

Updated on: Jul 08, 2025 | 6:40 AM

Pat Cummins Mocks Edgbaston Pitch: ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో పిచ్ స్వభావంపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదని, అలాంటి పిచ్‌లపై బౌలింగ్ చేయడానికి ఎవరూ ఇష్టపడరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

భారత విజయంలో గిల్, ఆకాశ్ దీప్ కీలకం..

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో సెంచరీ సాధించి రికార్డులు సృష్టించాడు. అతని అద్భుత బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 336 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా ఆకాశ్ దీప్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో రాణించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్ల తర్వాత భారత్‌కు ఇదే తొలి టెస్ట్ విజయం కావడం విశేషం.

కమిన్స్ సెటైర్స్..

ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో తమ టెస్ట్ మ్యాచ్‌ను గెలిచిన తర్వాత పాట్ కమిన్స్‌ను ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గురించి అడిగారు. దీనిపై కమిన్స్ స్పందిస్తూ, తాను ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ చూడలేదని, అయితే స్కోరును చూశానని చెప్పుకొచ్చాడు. “అసలు అలాంటి పిచ్‌లపై బౌలింగ్ చేయడానికి ఎవరు ఇష్టపడతారు? వికెట్ మరీ ఇంత ఫ్లాట్‌గా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ పిచ్‌ని చూస్తుంటే బౌలర్లకు భయమేస్తుంది” అని వ్యాఖ్యానించాడు. ఈ వారంలో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌లను పోల్చి చూస్తే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ బౌలర్లకు ప్రతికూలంగా ఉండగా, వెస్టిండీస్‌లోని పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఆసియా వికెట్ల మాదిరిగా చాలా ఫ్లాట్‌గా మారిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కమిన్స్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిరీస్ 1-1తో సమం కావడంతో రాబోయే లార్డ్స్ టెస్ట్‌కు పిచ్ ఎలా ఉంటుందో చూడాలి.

కమ్మిన్స్ భయపడ్డాడా..?

ఇక నెటిజన్లు మాత్రం కావ్యపాప కెప్టెన్ గిల్ సేన విజయ చూసి ఒకింత భయపడ్డాడని తెలుస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పిచ్ ఎంత ఫ్లాట్‌గా మారిన వికెట్లు పడగొట్టింది మాత్రం పేస్ బౌలర్లేనని కమ్మిన్స్‌కు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ సాధించిన అద్భుత విజయంపై పాట్ కమిన్స్ చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం పిచ్‌పై వ్యాఖ్య మాత్రమే కాకుండా, భారత బ్యాట్స్‌మెన్‌ల అద్భుత ప్రదర్శనకు పరోక్ష ప్రశంసగా కూడా భావించవచ్చు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..