విధ్వంసకర సెంచరీ.. పాకిస్థాన్‌లో కొత్త కోహ్లీ పుట్టుకొచ్చాడు! మళ్లీ మొదలెట్టేశార్రా బాబూ..!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్‌ ఘన విజయం సాధించింది. హసన్‌ నవాజ్‌ అద్భుతమైన 105 పరుగుల ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌ను విజయానికి దారితీశాడు. 45 బంతుల్లో సెంచరీ చేసిన నవాజ్‌ కోహ్లీ, రోహిత్‌తో పోల్చుతున్నారు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు. ఇతను ఎన్ని రోజులు ఆడతాడో చూడాలి.

విధ్వంసకర సెంచరీ.. పాకిస్థాన్‌లో కొత్త కోహ్లీ పుట్టుకొచ్చాడు! మళ్లీ మొదలెట్టేశార్రా బాబూ..!
Virat Kohli Hasan Nawaz

Updated on: Mar 22, 2025 | 9:49 AM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్‌ విజయం సాధించింది. 205 పరుగుల భారీ టార్గెట్‌ను కేవలం 16 ఓవర్లలోనే కొట్టేసి.. రికార్డ్‌ బ్రేకింగ్‌ విక్టరీ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పూర్తిగా యువ క్రికెటర్లతో కివీస్‌తో టీ20 సిరీస్‌ ఆడేందుకు వచ్చిన జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. మూడో టీ20ల్లో మంచి డామినేట్‌ విన్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ కంటే కూడా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్‌ హసన్‌ నవాజ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుకోవాలి. కేవలం 45 బంతుల్లోనే 10 ఫోర్లు, 7 సిక్సులతో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి పాక్‌కు ఈ సిరీస్‌లో తొలి విజయాన్ని అందించాడు. కాగా నవాజ్‌కు ఇది కేవలం మూడో అంతర్జాతీయ టీ20 మాత్రమే.

మూడో మ్యాచ్‌ ఆడుతూ.. టీ20ల్లో సెంచరీ చేయడం అంటే మెచ్చుకోదగిన విషయమే. కానీ, పాకిస్థానోళ్లంటే అతి కదా. అప్పుడే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మతో పోల్చడం మొదలెట్టేశారు. మా పాకిస్థాన్‌లో మరో కోహ్లీ పుట్టుకొచ్చాడు, మరో హిట్‌మ్యాన్‌ వచ్చేశాడంటూ సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. నవాజ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్బుతంగానే ఉన్నా.. వీరి అతి చూస్తే మాత్రం పాకిస్థానోళ్లంట్రా బాబూ అనాలనిపిస్తోంది. విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. ఒక స్టార్‌ ప్లేయర్‌గా మారిన తర్వాత ఈ కంప్యారిజన్స్‌ మొదలయ్యాయి. గతంలో హఫీజ్‌ అని ఇంకెవరినో కోహ్లీతో సమానం అంటూ పోల్చారు.

ఆ తర్వాత బాబర్‌ ఆజమ్‌ రాకతో ఈ పోలికలు పెట్టడం పీక్స్‌కు చేరుకుంది. మీకు కోహ్లీ ఉంటే మాకు బాబర్‌ ఉన్నాడంటూ ప్రతీ సారి బాబర్‌ను కోహ్లీతో సమానుడిగా పోల్చేవారు. అతనికి అంత సీన్‌ లేదని తేలిపోయింది. కోహ్లీ వచ్చిన తర్వాత పాక్‌లో చాలా మంది స్టార్లు వచ్చారు వెళ్లిపోయారు.. ఇప్పుడో మరో స్టార్‌ వచ్చాడు. అతనే హసన్‌ నవాజ్‌. అతని బ్యాటింగ్‌ స్టైల్‌ చూసి.. ఇదిగో కోహ్లీకి పోటీ ఇచ్చేవాడు వచ్చేశాడు, హిట్‌మ్యాన్‌ను మించినోడు వచ్చేశాడంటూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు. మరి ఇతను ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి. అయినా కోహ్లీ, రోహిత్‌లు ఒక్క ఫార్మాట్‌లో చేసినన్ని పరుగులైనా అన్ని ఫార్మాట్‌లో చేస్తాడో లేదో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.