Cricket: 1187 పరుగులు, 14 వికెట్లు.. బౌలర్లకు కన్నీళ్లు పెట్టిన టెస్ట్.. చరిత్రలోనే వరస్ట్!

|

Mar 11, 2022 | 3:45 PM

పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టుపై బ్యాటర్లు పరుగుల వరద పారించగా..

Cricket: 1187 పరుగులు, 14 వికెట్లు.. బౌలర్లకు కన్నీళ్లు పెట్టిన టెస్ట్.. చరిత్రలోనే వరస్ట్!
1
Follow us on

పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టుపై బ్యాటర్లు పరుగుల వరద పారించగా.. బౌలర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 4 వికెట్లకు 476 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్లకు 459 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. మొత్తం ఐదు రోజుల పాటు సాగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీనితో అంపైర్లు చివరికి డ్రాగా ముగించారు.

రావల్పిండి వేదికగా జరిగిన ఈ టెస్టులో మొత్తం 1187 పరుగులు నమోదు కాగా.. మొత్తం 14 వికెట్లు పడ్డాయి. పిచ్‌పై బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో నమోదైన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా రావల్పిండి పిచ్‌పై తీవ్ర విమర్శలు కురిపించారు.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కేవలం 4 వికెట్లు తీయడమే గమనార్హం. టాప్ క్లాస్ బౌలర్లు జట్టులో ఉన్నప్పటికీ.. కేవలం 4 వికెట్లు మాత్రమే పడ్డాయి. అలాగే ఆసీస్ బౌలర్లు ఏకంగా 728 పరుగులు సమర్పించారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా బౌలర్ల చెత్త ప్రదర్శన ఇదేనని చెప్పొచ్చు. ఇక ఒక టెస్టు మ్యాచ్‌లో ఇమామ్ ఉల్ హాక్ రెండు సెంచరీలు సాధించడం మొదటిసారి కాగా.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లలోనూ బరిలోకి దిగని ఏకైక ఆటగాడిగా ఫవాద్ ఆలమ్ చరిత్ర సృష్టించాడు.