
Khawaja Nafay Foolish Stumping: ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో పాకిస్తాన్ వికెట్ కీపర్ ఖ్వాజా నఫాయ్ చేసిన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 13 ఓవర్లలో 82 పరుగులు మాత్రమే చేసింది. 14వ ఓవర్లో స్పిన్నర్ మహ్మద్ నవాజ్ 3వ బంతికి జోష్ ఫిలిప్ వికెట్ పడగొట్టాడు. 5వ బంతికి ఆధిక్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కూపర్ కొన్నోలీ స్టంప్ ఔట్ అయ్యాడు.
కానీ, పాకిస్తాన్ వికెట్ కీపర్ బంతిని తన కుడి చేతిలో పట్టుకుని ఎడమ చేతిలో స్టంప్ చేయడం వల్ల అది నాటౌట్ అని ఇప్పుడు వెల్లడైంది. అంటే, బంతికి వికెట్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదు.
అయితే, పాకిస్తాన్ వికెట్ కీపర్ ఖ్వాజా నఫాయ్ ఆ అవుట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతే కాదు, ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ కూడా స్టంపింగ్ అవుట్ ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది.
ఇప్పుడు, ఈ భారీ మోసం వీడియో వైరల్ అవుతోంది. అంపైర్లు, పాకిస్తాన్ ఆటగాళ్ల మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ మ్యాచ్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాకిస్తాన్ 111 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..