BAN Vs PAK: రెండో టెస్ట్‎లో గెలిచిన పాక్.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..

|

Dec 08, 2021 | 9:54 PM

బంగ్లాదేశ్‎లోని ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్, ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది...

BAN Vs PAK: రెండో టెస్ట్‎లో గెలిచిన పాక్.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..
Pak
Follow us on

బంగ్లాదేశ్‎లోని ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్, ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 4-86తో రాణించాడు. అతను మొదటి ఇన్నింగ్స్‎లో 8 వికెట్లు పడగొట్టాడు. ఢాకాలో వర్షం కారణంగా మొదటి రోజు మూడో సెషన్ వాష్ అవుట్ కావడం, 2వ రోజు 6.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడంతో పాటు 3వ రోజు ఎలాంటి ఆట సాధ్యం కాకపోవడంతో పాకిస్తాన్ విజయం సందేహం మొదలైంది.

ఈ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ మొదటి ఇన్నింగ్స్‎లో నాలుగు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి డిక్లెర్ చేసింది. బాబర్ అజం 76, అజర్ అలీ 56, అలమ్ 50 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‎లో 87 పరుగులే అలౌట్ అయింది. దీంతో పాలోవన్ అడాల్సి వచ్చింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్‎లో 205 పరుగులకు అలౌట్ అయింది. షకీబ్ అల్ హసన్ 63 పరుగులు చేశాడు. తొలి టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Read Also.. Rohit Sharma: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‎గా రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్ట్ జట్టు ఎంపిక..

Google Year in Search 2021: గూగుల్‎లో ఎక్కువ మంది వెతికిన వ్యక్తిగా నీరజ్ చోప్రా.. ఆ తర్వాతి స్థానంలో ఆర్యన్ ఖాన్..