ఓపెనర్ రోహిత్ శర్మ టీమ్ ఇండియా వైట్ బాల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ అతను గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడు. వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohith Sharma)ను నియమించడం మంచి నిర్ణయమని పాక్ లెజెండరీ ఓపెనర్, మాజీ కెప్టెన్ అమీర్ సొహైల్(aamer sohail) అన్నాడు. టీమ్ ఇండియాకు ఎంపిక అవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ప్రదర్శన ఆధారంగా తీసుకోవాలని, ఐపీఎల్(ipl) ప్రదర్శన ఆధారంగా కాదని అమీర్ సోహైల్ ఉద్ఘాటించాడు.
“టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ గొప్ప ఎంపిక. కెప్టెన్సీ అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని నేను అనుకోను. అతనికి IPL కెప్టెన్సీ అనుభవం ఉంది. కొత్త ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మంచి వేదికగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అభివర్ణించాడు. అయితే దానిని టీమ్ ఇండియాలో ఎంపికకు కొలమానంగా తీసుకోవద్దు” అని చెప్పాడు.
ఇండో-పాక్ మ్యాచ్‌లు ఆడకపోవడంపై కూడా మాట్లాడాడు. చిరకాల ప్రత్యర్థి దేశాలు రెండూ 2012 సంవత్సరం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడలేదు. కేవలం ఐసీసీ టోర్నిల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయని అమీర్ సోహైల్ అన్నాడు. “క్రికెట్‌లో రాజకీయాలు తీసుకురావద్దని ఐసీసీ నిరంతరం చెబుతోంది. క్రికెట్ కోణంలో నేను కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాను. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ యుద్ధాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారు.” అని అన్నాడు.
2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 23న జరగనున్న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. గతేడాది దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ చివరిసారిగా తలపడగా, అందులో పాకిస్థాన్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.