ASIA CUP 2022: పాత అలవాట్లు, ఎంత వదులుకుందామనుకున్నా.. వదుకోలేం. ఈ సామెత పాకిస్థాన్ క్రికెట్ జట్టు విషయంలోనూ సరిగ్గా సరిపోతుంది. అదేంటంటే పాక్ జట్టు ఫీల్డింగ్.. ప్రతీ మ్యాచ్ లోనూ కొన్సి సింపుల్ క్యాచ్ లు మిస్ చేస్తూ.. పాక్ ఫీల్డర్లు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇప్పటికే పలుమార్లు పాక్ ఆటగాళ్లు క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించి ఢీకొనడం లేదా ఒకరినొకరు చూసుకోవడం వల్ల క్యాచ్‌లు పడిపోవడం జరిగింది. ఈసారి ఆసియా కప్‌లో కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఫైనల్‌కు వచ్చిన తర్వాత , బాబర్ అజామ్ జట్టు ఈ అతిపెద్ద లోపాన్ని మరోసారి భరించాల్సి వచ్చింది.
సెప్టెంబరు 11, ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, పాకిస్తాన్ మొదట బౌలింగ్ చేస్తూ 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అద్భుతంగా ప్రారంభించింది. ఇటువంటి పరిస్థితిలో, భానుక రాజపక్సే శ్రీలంక ఆధిక్యాన్ని కొనసాగించాడు. టోర్నమెంట్ మునుపటి మ్యాచ్‌ల మాదిరిగానే, తన జట్టుకు మరోసారి బలమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఆసిఫ్ క్యాచ్, షాదాబ్ ఢీ..
అర్ధసెంచరీ సాధించిన భానుక చివరి ఓవర్‌లో పరుగుల వేగాన్ని పెంచుతూ 19వ ఓవర్ చివరి బంతికి పాకిస్థాన్‌కు కూడా అవకాశం ఇచ్చాడు. మహ్మద్ హస్నైన్ వేసిన బంతిని భానుక డీప్ మిడ్ వికెట్ బౌండరీ వైపు ఎత్తుగా ఆడాడు. ఇక్కడ ఆసిఫ్ అలీ బంతిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. అతను కూడా క్యాచ్ తీసుకున్నాడు.
Ffs pic.twitter.com/VGMg6Rpk85
— Nooruddean (@BeardedGenius) September 11, 2022
అటువైపు నుంచి షాదాబ్ ఖాన్ కూడా చూడకుండా క్యాచ్ కోసం చేరుకుని నేరుగా ఆసిఫ్ ను ఢీకొట్టాడు. షాదాబ్ తల బంతికి తగలగానే ఆసిఫ్ క్యాచ్ వదిలేశాడు. దీంతో బంతి నేరుగా సిక్స్ వెళ్లింది.
సద్వినియోగం చేసుకున్న రాజపక్సే..
ఆసిఫ్ అలీ చేతి నుంచి పడిన బాల్ నేరుగా బౌండరీ అవతల పడింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, షాదాబ్ ఖాన్ చాలాసేపు నొప్పితో మూలుగుతూ నేలపై పడి ఉన్నాడు. ఆ సమయానికి భానుక 51 పరుగులతో ఆడుతుండగా, శ్రీలంక స్కోరు 149 పరుగులు. ఈ సిక్స్‌తో సహా, శ్రీలంక చివరి 7 బంతుల్లో మొత్తం 21 పరుగులు రాబట్టింది. అందులో 20 పరుగులు రాజపక్సేవే కావడం విశేషం. రాజపక్సే చివరి వరకు నాటౌట్‌గా వెనుదిరిగి 45 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా, 58 పరుగులకు 5 వికెట్ల నుంచి కోలుకున్న శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.