Haider Ali : తను మంచోడు ఏ తప్పు చేయలేదు.. కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న స్టార్ క్రికెటర్

పాకిస్తాన్ తరపున 35 టీ20ఐ మ్యాచ్‌లు ఆడిన హైదర్ అలీపై గత నెలలో లండన్‌లో ఒక యువతి అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ ఆటగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ షాహీన్ తరపున ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో, గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అతనిని కంటర్‌బరీ మైదానం నుండి తీసుకెళ్లారు.

Haider Ali : తను మంచోడు ఏ తప్పు చేయలేదు.. కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న స్టార్ క్రికెటర్
Haider Ali

Updated on: Sep 04, 2025 | 8:57 AM

Haider Ali : పాకిస్తాన్ తరపున 35 టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌పై బ్రిటన్​లో రేప్ కేసు నమోదైంది. గత నెలలో పాకిస్తాన్ షాహీన్స్ జట్టు తరపున ఇంగ్లాండ్​లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు అతడిని లండన్‌లో అరెస్టు చేశారు. కాంటర్‌బరీ మైదానంలో మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఒక మహిళ రేప్ ఆరోపణలు చేసింది. అయితే, ఇప్పుడు లండన్ కోర్టు ఈ కేసులో అతడికి భారీ ఊరటనిస్తూ తీర్పు ఇచ్చింది. పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీ ఈ కేసులో నిర్దోషిగా తేలింది.

హైదర్ అలీకి భారీ ఊరట..

ఒక బ్రిటిష్-పాకిస్తానీ మహిళ హైదర్ అలీపై రేప్ ఆరోపణలు చేసింది. కానీ, సాక్ష్యాల కొరత కారణంగా కోర్టు ఈ కేసును రద్దు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. క్రిమినల్ లా నిపుణుడు బారిస్టర్ మోయిన్ ఖాన్ హైదర్ అలీ తరపున వాదించారు. మాంచెస్టర్‌లోని ఒక హోటల్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఒక బ్రిటిష్-పాకిస్తానీ మహిళ ఆరోపణలు చేయడంతో హైదర్ అలీని పోలీసులు విచారించారు. ఈ సమయంలో మాంచెస్టర్ పోలీసులు 24 ఏళ్ల హైదర్ అలీని అరెస్టు చేశారు.

విచారణలో ఏమైందంటే..

పోలీసులకు ఆ మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆమె మొదటిసారిగా జూలై 23, 2025న మాంచెస్టర్‌లోని ఒక హోటల్‌లో హైదర్ అలీని కలిసింది. ఆ తర్వాత ఆగస్టు 1న ఆష్ఫోర్డ్‌లో మళ్లీ కలిశారు. ఈ కేసులో మొదటిసారి కలిసిన దాదాపు రెండు వారాల తర్వాత మహిళ ఫిర్యాదు చేసింది. నివేదికల ప్రకారం.. హైదర్ అలీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లడానికి స్వేచ్ఛగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతను ఇప్పటికే తన పాస్‌పోర్ట్‌ను పోలీసు స్టేషన్ నుంచి తీసుకున్నాడు. ఎప్పుడైనా యూకే నుంచి వెళ్లిపోవచ్చు.

ఆరోపణలను ఖండించిన హైదర్ అలీ

హైదర్ అలీ ఈ కేసులో మొదట్నుంచీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. విచారణ బృందానికి, ఆ మహిళ తనకు తెలుసునని, వారు ఒకరికొకరు పరిచయం అని చెప్పాడు. కానీ, ఆ మహిళతో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశాడు. పోలీసులు అలీని అరెస్టు చేసిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అలీ పాకిస్తాన్ తరపున 35 టీ20 మ్యాచ్‌లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అతను 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..