Pakistan vs Australia: భారత్‌లో వన్డే ప్రపంచకప్ 2023 జోరుగా సాగుతోంది. అన్ని జట్లు విజయం కోసం పోరాడుతున్నాయి. కాగా, టోర్నీలో ఇప్పటికే 14 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అన్ని టీంలు వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి వస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ టీం మాత్రం భారత పర్యటనను తెగ ఎంజాయ్ చేస్తోంది. దేశంలో ప్రముఖ వంటకాలను టేస్ట్ చేస్తూ ఫుల్‌గా లాగించేస్తున్నారు.
భాగ్యనగరంలో ఉన్నన్ని రోజులు హైదరాబాద్ బిర్యానీని పీకలదాకా లాగించేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులు.. తెగ నచ్చేసిందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఇక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్న పాక్ టీం.. అక్కడ స్పెషల్ ఐటం కబాబ్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, పాకిస్తాన్ టీం అక్టోబర్ 20న ఇక్కడ ఆస్ట్రేలియాతో ఢీకొట్టనుంది. మ్యాచ్‌కు రెండు రోజుల ముందుగానే బెంగళూరుకు చేరుకున్న పాక్ టీం అక్కడి స్పెషల్ వంటకాలున టేస్ట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఐసీసీ ప్రపంచకప్ 2023లో శ్రీలంక, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ గెలుపొందగా, టీమిండియాపై ఘోర పరాజయం పాలైంది. మరోవైపు శ్రీలంకపై గెలిచిన ఆస్ట్రేలియా టీం.. భారత్, సౌతాఫ్రికాపై ఓటమి పాలైంది. కాగా, ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకంగా మారింది. టోర్నీలో టాప్ 4లో చేరాలంటే తమ వాదనను బలంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు బలమైన జట్ల పోరుకోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్క్వాడ్‌లు:
పాకిస్థాన్ జట్టు: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఉసామా మీర్, అబ్దుల్లా షఫీక్.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ , కామెరాన్ గ్రీన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..