Pakistan Cricket: పక్కకెళ్లి ఆడుకోండ్రా..! పాక్ క్రికెట్‌కు ఇక ఎండ్ కార్డేనా..?

చింత చచ్చినా పులుపు చావలేదనుకున్నాం.. కానీ, పాకిస్తాన్‌కి పులుసు కారడం కూడా ఇప్పుడిప్పుడే మొదలైనట్టుంది. దాయాది దేశపు క్రికెట్ పెద్దలకు ఎక్కిన కైపు కొద్దికొద్దిగా దిగొస్తున్నట్టే ఉంది. ఎందుకంటే.. న్యాయంగా మనకు దక్కాల్సిన కప్పును వెనక్కు తీసుకెళ్లి తొండాటకు దిగిన ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీకి ఇప్పుడిప్పుడే తత్వం బోధపడ్తున్నట్టుంది. పాకిస్తాన్ మంత్రి కూడా ఐన ఈ పెద్దమనిషి నిన్నటిదాకా మనమీద నోటికొచ్చినట్టు వెటకారమాడేశాడు.

Pakistan Cricket: పక్కకెళ్లి ఆడుకోండ్రా..! పాక్ క్రికెట్‌కు ఇక ఎండ్ కార్డేనా..?
Pakistan Cricket

Updated on: Oct 01, 2025 | 9:50 PM

తన కోపమే తనకు శత్రువన్న కనీస ఇంగితం లేకుండా, కండకావరం చూపించినందుకు భారీ మూల్యం చెల్లించుకుంటోంది పాకిస్తాన్. అలవికానిచోట అధికులమనరాదన్న జ్ఞానం లేకుండా ఆసియా కప్ ప్రెజెంటేషన్ సెరిమనీలో ఓవరాక్షన్లు చేసినందుకు క్రికెట్‌ ప్రపంచం ఎదుట తలదించుకు నిలబడింది పాకిస్తాన్. కానీ, పరువుతక్కువ పనులు చేసినందుకు తప్పు ఒప్పుకుని లెంపలేసుకోవడం మానేసి, ఇగో లాంటిదేదో అడ్డమొచ్చింది పాకిస్తానోళ్లకు. తనకు తానే కొరడా దెబ్బలు కొట్టుకుంటోంది. భారీసైజు శిక్షలు విధించుకుంటోంది. ఫైనల్‌గా తన వేలితోనే తన కళ్లు పొడుచుకుంటోంది. క్రికెట్ పాకిస్తాన్‌ పతనావస్థకు ఇది కాదా సంకేతం? చింత చచ్చినా పులుపు చావలేదనుకున్నాం.. కానీ, పాకిస్తాన్‌కి పులుసు కారడం కూడా ఇప్పుడిప్పుడే మొదలైనట్టుంది. దాయాది దేశపు క్రికెట్ పెద్దలకు ఎక్కిన కైపు కొద్దికొద్దిగా దిగొస్తున్నట్టే ఉంది. ఎందుకంటే.. న్యాయంగా మనకు దక్కాల్సిన కప్పును వెనక్కు తీసుకెళ్లి తొండాటకు దిగిన ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీకి ఇప్పుడిప్పుడే తత్వం బోధపడ్తున్నట్టుంది. పాకిస్తాన్ మంత్రి కూడా ఐన ఈ పెద్దమనిషి నిన్నటిదాకా మనమీద నోటికొచ్చినట్టు వెటకారమాడేశాడు. ఇప్పుడతణ్ణి దారికి తెచ్చుకునే పన్లో పడింది ఇండియన్ క్రికెట్ బోర్డ్. తనను వరల్డ్‌ క్లాస్ జోకర్‌గా చూపిస్తూ ట్రోలింగ్ జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోయాడో ఏమో అతడుకూడా మారుమనసు పొందక తప్పలేదు. ఎంత మారినా, ఆరిజన్ పాకిస్తాన్ కదా, అందుకే ఒరిజినల్ అలాగే ఉంది. ఆసియా కప్‌ ట్రోఫీ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌ దగ్గర పంచాయితీ పెట్టేసింది. మంగళవారం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి